Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ద్వారంపూడికి భీమ్లానాయక్ ట్రీట్ మెంట్ చూపిస్తా: చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్!

ద్వారంపూడికి భీమ్లానాయక్ ట్రీట్ మెంట్ చూపిస్తా: చంద్రశేఖర్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్!
ఇప్పటం సభలో పవన్ ఆవేశం
ద్వారంపూడి తనను పచ్చిబూతులు తిట్టాడన్న పవన్
తాను ఊరుకున్నా జనసైనికులు బాధపడ్డారని వివరణ
నిలదీసేందుకు వెళితే దాడులు చేశారని ఆరోపణ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

“వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి గారికి ఓ విషయం చెప్పదలుచుకున్నాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి అకారణంగా నన్ను పచ్చిబూతులు తిట్టాడు. వినకూడని మాటలు అన్నాడు. అయినా నేను ఊరుకున్నాను. కానీ మా జనసైనికులకు కోపాలు వచ్చాయి. పంతం నానాజీ వంటి నేతలకు కోపాలు వచ్చాయి. ఎందుకు ఇలా అన్నావంటూ వారు నిలదీయడానికి వెళితే వారిపై దాడులు చేశారు. నన్ను అన్న మాటలతో నాకు బాధ అనిపించలేదు కానీ, వీర మహిళలు వారు అనిపించుకున్న మాటలు నాకు చెబితే… అయ్యో వీళ్లను ఎందుకు రాజకీయాల్లో దించాను అని బాధపడ్డాను.

వైవీ సుబ్బారెడ్డి గారూ.. మీరు పెద్దవాళ్లు, విజ్ఞులు… ఇంత గడ్డిపెట్టండి. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ కు కూడా చెబుతున్నాం… గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ గారి ట్రీట్ మెంట్ జరిగింది! భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే వ్యవహరిస్తే భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ అంటే ఏంటో చూపిస్తా” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అలాగే వైశ్య సామాజిక వర్గాన్ని కూడా రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, యానాదులు, ముత్తరాసి, బీసీ సంచార జాతులకు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు, ఎస్సీ సోదరులకు, అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.

 

ఇప్పటం సభలో పవన్ కల్యాణ్ ఫైనల్ టచ్ ఇదే!

Pawan Kalyan speech at Ippatam

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. ఆద్యంతం వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. చివరగా కొన్ని మాటలు చెప్పి ప్రసంగాన్ని ముగిస్తున్నానంటూ ఆవేశపూరిత సందేశం వినిపించారు.

“పొరుగువాడి మంచితనం దుష్టుడి దురంహకారాన్ని రెచ్చగొడుతోంది. పక్కవాడి సౌభాగ్యం బాలిశుడి గుండెల్లో మంటలు రేకెతిస్తోంది. ప్రజల నోళ్లు కొట్టి, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజదొంగలు రాజులై రారాజులై ఏలుతున్నారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ కవితాపంక్తులు వర్తమాన వైసీపీ పాలకులకు చాలా సహజంగా వర్తిస్తాయి… కర్ణుడికి కవచ కుండలాల్లాగా అతికినట్టు సరిపోతాయి. బాలిశుడు అంటే మూర్ఖుడు.. నా ఉద్దేశంలో దుర్మార్గుడు అని అర్థం.

అధికార మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఇదే జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం!” అని వ్యాఖ్యానించారు.

అలాగే, బీజేపీ నేతలు, పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, ఆ రోడ్ మ్యాప్ ఎప్పుడిస్తారో చెబితే వైసీపీని ఎలా దించాలో తాము చూసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని, పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలేసి రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

“కూల్చేవాడుంటే కట్టే వాడుంటాడు… విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు… చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు… తలెగరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు… దోపిడీ చేసే వైసీపీ గూండా గాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు… వైసీపీది విధ్వంసం జనసేనది విఘాతం. వారిది ఆధిపత్యం… మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా…. ఇది జనసైనికుల గడ్డ… జై జనసేన” అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం ముగించారు.

Related posts

రేణుక చౌదరి …అమరావతి మద్దతు రహస్యం …

Drukpadam

తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా బండి సంజయ్ పాద‌యాత్ర‌!

Drukpadam

మీడియా పై మాయావతి చిందులు ….కులపిచ్చి ఉందంటూ ఆగ్రహం !

Drukpadam

Leave a Comment