బీజేపీ విధానాలను అసెంబ్లీ లో ఉతికి ఆరేసిన కేసీఆర్!
మత చిచ్చు పెట్టడమే దానిపని అని ధ్వజం
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న వైనం
హిజాబ్ పైన కీలక వ్యాఖ్యలు
ఎఫ్ ఆర్ బి ఎం లోను వివక్ష
అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉన్నదని వ్యాఖ్యానించారు
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకపడ్డారు . బీజేపీ విధానాలను వివరిస్తూ ఉతికి ఆరేశారు . బీజేపీ దేశంలో ప్రమాదకరమైన గేమ్ ఆడుతుందని ధ్వజమెత్తారు . మత పిచ్చి ఆధారంగా దేశాన్ని పాలించాలని చూస్తుందని దుయ్యబట్టారు . బీజేపీ విధానాలపై ప్రజలు అప్రమత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు .ఇప్పటికే రాష్ట్రాల హక్కులను హరిస్తుందని ,ఇప్పుడు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులపై కూడా పెత్తనం చేయాలనీ చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రాలను తమపాలన తాము చేసుకునే ఈవిధంగా కాకుండా నిరంతరం రాష్ట్రాలపై పెత్తనం చేయాలనే ధోరణి కనపడుతుందని విమర్శించారు . రాష్ట్రాల ,కేంద్రం మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉన్న దాన్ని చెడిపేసే ప్రయత్నం చేస్తున్నదని ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని హెచ్చరించారు.
గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదని రాష్ట్రాలకు పూర్తీ స్వేచ్ఛ ఉండేదని దాన్ని హరించడానికి ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు . రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆటోమేటిక్ గా రావాల్సి ఉండగా రాష్ట్రాలు బిచ్చగాళ్ల మాదిరిగా కేంద్రం వద్ద చేయిచాపాల్సి వస్తుందని అదికూడా అనేక సార్లు తిరిగి గుర్తు చేస్తే దయతలచి వారు ఎదో ఇచ్చినట్లు ఇవ్వడం రాష్ట్రాలపట్ల కేంద్ర వైఖరిని వెల్లడిస్తుందని అన్నారు.
ఎఫ్ ఆర్ బి ఎం లోను వివక్షే …
కేంద్రం రాష్ట్రాలు అప్పుడు తీసుకుందుకు వెసులు బాటు కల్పించింది. దాన్నే ఎఫ్ ఆర్ బి ఎం అంటారు . అయితే కేంద్రం 6 శాతం వరకు తీసుకునే అవకాశం కల్పించి రాష్ట్రాలకు మాత్రం 4 మాత్రమే అని అన్నారు. అదికూడా కరెంటు మీటర్లు పెడితే 4 శాతం లేకపోతె మరో 0 .5 శాతం తగ్గించారు . ఇదెక్కడి డొంకతిరుగుడు వ్యవహారం అని కేసీఆర్ ఫైర్ అయ్యారు . అనేక రాష్ట్రాలు అప్పులు తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా 165 లక్షల కోట్లు అప్పులు చేసింది. తెలంగాణ అప్పులు చేయడంలో 24 స్థానంలో ఉన్నది .తలసరి ఆదాయంలోనూ ,అభివృద్ధిలోనూ అందరికంటే కేంద్రం కంటే మనమే ముందున్నాం అని కేసీఆర్ సభకు వివరించారు.
పనిలో పనిగా కేసీఆర్ కర్ణాటక హైగాకోర్టు తీర్పు నేపథ్యంలో ఎవరు ఏ బట్టలు వేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు అని ప్రశ్నించారు. కొన్ని ఆచారాలు పద్ధతులు ఎప్పటినుంచో వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్నా వివిధ పథకాలు గురించి విమరించారు . తెలంగాణ అద్భుత ప్రగతి సందించిందని మరింత సాదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు .
ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరబాటు చేయొద్దు… వారిని విధుల్లోకి తీసుకుంటున్నాం: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
అప్పటినుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కొన్ని రోజుల కిందట కూడా తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి పొరపాటు చేయొద్దని హితవు పలికారు.
సెర్ప్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన విషయం తెలిపారు.
కాగా, తెలంగాణలో తొలగింపునకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా నిలిచింది. 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆప్ కేంద్రాన్ని కోరింది. ఆప్ దక్షిణాది విభాగం ఇన్చార్జి సోమ్ నాథ్ భారతి నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సింహాను కలిసి విజ్ఞప్తి చేశారు.