కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన షురూ ….ఐదు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాకు ఆదేశం !
-ఎన్నికల ఓటమికి భాద్యత వహించాలని వెల్లడి
-సోనియా పేరిట ప్రకటన విడుదల
-పార్టీ పునర్వ్యవస్థీకరణపై సోనియా దృష్టి
-5 రాష్ట్రాల పార్టీ శాఖలకు ఆదేశాలు
-తక్షణమే రాజీనామా చేయాలంటూ పీసీసీ చీఫ్‌లకు హుకుం
ఇటీవలే ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో పార్టీని పటిష్ఠపరిచే పనికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఓటమిపై పోస్టుమార్టం పేరిట పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించిన పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లకు చెందిన పార్టీ శాఖల చీఫ్‌లు (పీసీసీ) తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని సోనియా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాల రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నందున పీసీసీ పదవులకు రాజీనామాలు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాటి స్పందన రాలేదు .
మొన్న హాట్ హాట్ గా జరిగిఆన్ సీడబ్యూ సి సమావేశంలో ఐదురాష్ట్రాల ఎన్నిలకల్లో పార్టీ ఫలితాలపై చర్చించారు. ఇందులో జి – 23 నేతలు కూడా పాల్గొన్నారు . పార్టీ ప్రక్షాళన చేయాలనీ సభ్యులు అభిప్రాయపడ్డారు . అసమ్మతి నేతలు మాత్రం ముఖుల్ వాస్నిక్ ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు పెద్దగా స్పందన రాకపోవడంతో సభ్యులు మిన్నకుండి పోయారు . సీడబ్యూ సి సమావేశంలో పూర్తీ కాలం అధ్యక్ష భాద్యతలు రాహుల్ గాంధీ చేపట్టలేని డిమాండ్ సైతం వచ్చింది. కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చారు . దానిపై కూడా సీడబ్యూ సి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు . చివరకు త్వరలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరపాలని నిర్ణయించారు . ఈ రోజు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అధ్యక్షుల ను రాజీనామా చేయాలనీ సోనియా ఆదేశాలు జారీచేశారు . దీంతో ప్రక్షాల దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు అయింది.