Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చిక్కుల్లో చినజియ్యర్ …సమ్మక్క సారలమ్మపై అనుచిత వ్యాఖ్యలు కేసు నమోదు!

చిక్కుల్లో చినజియ్యర్ …సమ్మక్క సారలమ్మపై అనుచిత వ్యాఖ్యలు కేసు నమోదు!
-జీయర్‌ స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీఎస్ లో ఫిర్యాదు
-జీయర్ పై ఫిర్యాదు చేసిన ఆదివాసీ సంక్షేమ పరిషత్
-సమ్మక్క, సారలమ్మను అవమానించేలా మాట్లాడారని మండిపాటు

” సమ్మక్క ,సారలమ్మలు దేవతలా ?వారేమైనా బ్రమ్మలోకం నుంచి దిగివచ్చారా ? గ్రామదేవతలు …వారిని దేవతలపేరుతో పూజించడం …చదువుకున్నవాళ్ళు వ్యాపారులు వెళ్లడం … బ్యాంకు లు పెట్టడం ఏమిటి ఇది అంటూ” చిన్నజియ్యర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి ఆదివాసీలు పూజించే వానదేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజియ్యర్ పై ఎస్సి ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వరంలో దుమ్ముగూడం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . దీనిపై కాంగ్రెస్ కు చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా మంది పడింది. ఆయన అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం అని ధ్వజమెత్తింది. ఆయన వానదేవతలను వ్యాపారం అంటూ కించపరచడాన్ని తప్పు పట్టింది. వ్యాపారం ఆయన పెట్టిన సమతామూర్తి విగ్రహం దగ్గర జరుగుతుందని విమర్శించింది . వానదేవతలను దర్శించుకోవడానికి ఎలాంటి డబ్బులు అవసరం లేదని కానీ సమతామూర్తి దర్శనానికి 150 టికెట్ పెట్టడం వ్యాపారమా ? కదా ? అని ప్రశ్నించింది. 120 కిలోల బంగారం వేల కోట్లా రూపాయలు ఎక్కడ నుంచి వచ్చేయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది. వందేవతలను కించపరిచి అనుచిత వ్యాఖ్యలు chesinanduku చిన్నజియ్యర్ స్వామి బేషరత్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
లక్షలాది మంది ఆరాధిస్తున్న వానదేవతను తూలనాడటం ,అనుచిత వ్యాఖ్యలు చేయడం పై ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి.

చినజీయర్ స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివాసీల వనదేవత సమ్మక్క, సారలమ్మలను అవమానించేలా చినజీయర్ మాట్లాడారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర మాట్లాడుతూ, ఆదివాసీ ఆడబిడ్డల చరిత్ర తెలియని చినజీయర్ కు వారి గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్ దని విమర్శించారు. సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా చినజీయర్ పై మండిపడిన సంగతి తెలిసిందే. సమతామూర్తి విగ్రహాన్ని చూడటానికి చినజీయర్ రూ. 150 టికెట్ ధర పెట్టారని… మీది బిజినెస్ అని.. సమ్మక్క, సారలమ్మ తల్లుల దగ్గర అలాంటి వ్యాపారం జరగదని అన్నారు.

Related posts

భారత్ లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి… బిపిన్ రావత్!

Drukpadam

 మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన

Ram Narayana

Best Skincare Products Perfect For Your Family Vacation

Drukpadam

Leave a Comment