Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైదరాబాద్‌లో బీజేపీ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌ …

హైదరాబాద్‌లో బీజేపీ ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌ …
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
నియంతృత్వాన్ని కొల్లగొట్టాలి
అసెంబ్లీలోకి అనుమతించాలి
టీఆర్ఎస్‌పై బీజేపీ నేత‌ల ఫైర్

బీజేపీ శాసనసభ్యులను సభకు రాకుండా సస్పెండ్ చేసి కోర్ట్ సూచనలను కూడా పాటించకుండా నియంతృత్వంగా వ్యవహరించడంపై ఆందోళన చేపట్టింది. 2023 అధికారమే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీ వచ్చిన ప్రతి అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉద్యమ బాట పడుతుంది. రాజ్యాంగం పరిరక్షణ పేరుతొ జరుగుతున్నా ఈ దీక్ష కు పోలీస్ లు అనుమతి ఇవ్వలేదు . ఫలితంగా కోర్ట్ ను ఆశ్రయించిన బీజేపీ ఎట్టకేలకు అనుమతి తెచ్చుకొని ఇందిరా పార్క్ లో దీక్ష చేపట్టింది. ఈ దీక్ష కు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలి వచ్చారు . ప్రజాస్వామ్య పరిరక్షణ , ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై దీక్షలో పాల్గొన్న నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు .

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వ‌ద్ద‌ బీజేపీ తెలంగాణ నేత‌లు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు దిగారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల‌ని, నియంతృత్వాన్ని కొల్లగొట్టాల‌ని నినదిస్తున్నారు. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావుతో పాటు ప‌లువురు నేత‌లు ఈ దీక్ష‌లో పాల్గొన్నారు.

అసెంబ్లీలోకి త‌మ‌ను అనుమ‌తించే అంశాన్ని పరిశీలించాని హైకోర్టు సూచన చేసిన‌ప్ప‌టికీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దాన్ని తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయాల‌ను తుంగలో తొక్కుతోంద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, మొద‌ట‌ బీజేపీ నేత‌ల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చివ‌ర‌కు బీజేపీ నేత‌లు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని ఈ దీక్ష చేప‌ట్టారు. బీజేపీ దీక్ష దృష్ట్యా ఇందిరా పార్క్ వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు.

Related posts

నన్ను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసమే: ట్రంప్

Drukpadam

ఇది మైసూరా రాజకీయం …మరోసారి గ్రేటర్ రాయలసీమ ప్రస్తావన…

Drukpadam

కండోమ్స్ ఎక్కువ‌గా వాడేది ముస్లింలే: ఎంపీ అస‌దుద్దీన్!

Drukpadam

Leave a Comment