తుమ్మలే పెద్ద ద్రోహి …కందాల అనుచరులు ఘాటు వ్యాఖ్యలు!
తుమ్మల నియోజకవర్గంలో రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారు
పార్టీ ఎవరికీ టికెట్ ఇస్తే వారికే చేస్తాం
కందాల నియోజకవర్గంలో ప్రజల కోసం పరితపిస్తున్నారు
ప్రజలు ఆయన్ను దేవుడిగా పూజిస్తున్నారు
కార్యకర్తలు సమన్వయం తో ఉండాలి
బెల్లం వేణు , ఇంటూరి శేఖర్ , బ్రమ్మయ్య , బాలకృష్ణ రెడ్డి ….
పాలేరు నియోజకవర్గంలో టీఆర్ యస్ గ్రూప్ తగాదాలు రచ్చకెక్కాయి. 2023 లో జరగనున్న ఎన్నికలకోసం ఎప్పటినుంచే కుస్తీ పోటీలు మొదలైయ్యాయి. గత ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్న ఎన్నికల్లో తిరిగి పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు . గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసి గెలిచినా కందాల ఉపేందర్ రెడ్డి అనివార్య కారణాలవల్ల టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. రేపు ఎన్నికల్లో టీఆర్ యస్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆశక్తిగా మారింది. కాంగ్రెస్ గెలిచి టీఆర్ యస్ లో చేరిన ఉపేదర్ రెడ్డి సిట్టింగ్ అయినందున తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు . అయితే మాజీమంత్రి తుమ్మల మాత్రం గత ఎన్నికల్లో తాను టీఆర్ యస్ నుంచి పోటీచేసినందున తనకే టికెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు . దీంతో వీరువు నేతలు ఎవరికీ వారు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు . అక్కడక్కడా వీరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వాతారణం మరింత వేడెక్కే అవకాశం ఉంది.
తుమ్మల బుధవారం నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో పర్యటించారు . ఆ సందర్భంగా అనుయాయిలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు . తుమ్మల కూడా మోటార్ సైకిల్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు . అనంతరం జరిగిన సభలో శత్రువులను నమ్మవచ్చు కానీ పార్టీలోనే ఉండి పార్టీకి వెన్ను పోటుపొడిచేవారు ద్రోవులని ఘాటుగానే స్పందించారు . దీనిపై గురువారం కందాల అనుచరులు స్పందించారు . నెలకొండపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ , అసలు ద్రోహి తుమ్మలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు . తుమ్మల రెచ్చగొట్టేందుకే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. తుమ్మల వ్యవహార శైలి నచ్చకనే ఆయన్ను ప్రజలు ఓడించిన విషయాన్నీ గుర్తుంచుకోవాలని వారు అన్నారు . ఎవరికీ టికెట్ వస్తే వారికీ తాము సహకరిస్తామని అంతేకాని పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోమని స్పష్టం చేశారు . ఎమ్మెల్యే కందాల నియోజకవర్గంలో ప్రజలకోసం పరితపిస్తున్నారని ఆయన నియోజకవర్గ ప్రజల దేవుడని పేర్కొన్నారు . కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని పిలుపు నిచ్చారు . విలేకర్ల సమావేశంలో బెల్లం వేణు , ఇంటూరి శేఖర్ , బ్రమ్మయ్య , బాలకృష్ణ రెడ్డి , వీరన్న , నెలకొండప్పల్లి జడ్పీటీసీ , ఎంపీపీ లు పాల్గొన్నారు .