తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ…
-అధికారికంగా వెల్లడించనున్న బీజేపీ కేంద్ర నాయకత్వం
-జనసేన -బీజేపీ మిత్రపక్షాలుగా బరిలోకి
తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి ,కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను తమ అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించింది. అయితే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఫైనల్ చేసిన అంతరం నేడు ప్రకటించే ఆవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆమెకు మంచి అధికారిగా పేరుంది . మరో ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరును కూడా బీజేపీ పరిశీలించినప్పటికీ చివరికి రత్నప్రభ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. జనసేన బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎవరి ఇక్కడ పోటీ చేయాలనే విషయంలో ఇటీవల కాలం వరకు స్పష్టత రాలేదు .ఎట్టకేలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ కు ఒప్పించినా బీజేపీ రత్నప్రభను తన అభ్యర్థిగా బరిలోకి దించనున్నది. అయితే జనసేన కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. మొదటి నుంచి బీజేపీ మద్దతుతో తామే ఇక్కడ పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించి చివరకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించటంపై పవన్ నిర్ణయాన్ని సైతం కొందరు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు . ఇటీవల జరిగిన మున్సిపల్ ,పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆపార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయినప్పటికీ లోకసభకు తామే పోటీ చేయాలనే పట్టుదలతో ఉండటంతో బీజేపీకి పోటీపై ఆశక్తి నెలకొన్నది.