Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల పాలేరునే ఎందుకు ఎంచుకున్నారు …రాజకీయ సర్కిల్స్ లో ఆసక్తి!

షర్మిల పాలేరునే ఎందుకు ఎంచుకున్నారు …రాజకీయ సర్కిల్స్ లో ఆసక్తి!
-రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారా ?
-ఎస్సీ ,ఎస్టీ ఓట్లు పై కన్నేశారా??
-సామాజికమంగా రెడ్డి కుల ప్రభావం కరుణిస్తుందనుకున్నారా ???

వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ లో పరిచయం అక్కర్లేని పేరు …. పార్టీ ఏమీలేని తెలంగాణ లో తనతండ్రి దివంగతనేత డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ , ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు తనకు కలిసొచ్చి ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకుంటారని ఆమె నమ్మకం …అందుకే రాజకీయ పండితులని ఆశ్చర్యానికి గురిచేస్తూ తెలంగాణాలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు …. అనేక విమానాలు చీదరింపులు ,ఏపీ సీఎం సొంత అన్న తెలంగాణాలో పార్టీ వద్దని వారించినా వినకుండా పార్టీ పెట్టిన షర్మిల పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు . ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా తన పాదయాత్ర చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పై కేసీఆర్ కుటుంబపాలనపై విమర్శలు గుప్పించారు . మొదట కొంత ఆదరణ తక్కువగా ఉందనుకున్నప్పటికీ రానురాను ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా వచ్చే ఏడాది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోనే పాలేరు చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.

పాలేరు ను ఎందుకు ఎంచుకున్నట్లు … ఆసక్తిగా మరీనా అంశం ..

ఆమె పాలేరు ను ఎందుకు ఎంచుకున్నారు . గతంలో ఈమెకు పాలేరుతో ఎలాంటి సంబంధం లేదుకదా ? కారణాలు ఏమిటి ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థులే రంగంలో దిగబోతున్నారు కదా ? అనే చర్చ నడుస్తుంది . అయితే ఇక్కడ ఎస్సీ ,ఎస్టీ లు బీసీలు అధికంగా ఉన్నారు . పైగా రెడ్డి సామాజికవర్గం ప్రబావితమైనదిగా ఉంది. ఈ నియోజకవర్గం అనాదిగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అందువల్ల ఆమె పాలేరు ను ఎంచుకొని ఉండవచ్చునననే అభిప్రాయాలూ ఉన్నాయి. అంటే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గాపని చేసిన డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు , ప్రజల్లో ఆయనకున్న ఆకర్షణ ఆయన బిడ్డగా తనకు కలిసి వస్తుందనే విశ్వాసం ఆమెలో ఉండవచ్చుననే అభిప్రాయాలూ ఉన్నాయి.

ఇప్పటికి టీఆర్ యస్ లో ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య వార్ నడుస్తుంది. ..కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు . కాంగ్రెస్ తో అవగాహనా కుదిరితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి షర్మిల మాటేమిటి అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ తో షర్మిల పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందనేది ఒక టాక్ ..అదే జరిగితే పాలేరు ఆమె కోరితే కాంగ్రెస్ కాదనకపోవచ్చునని అంటున్నారు రాజకీయపండితులు … అదే జరిగితే అప్పుడు షర్మిల గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని అంటున్నారు పరిశీలకులు …

Related posts

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్!: కేంద్రమంత్రి పదవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య…

Drukpadam

కమ్మ కోటాలో మధుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా అవకాశం!

Drukpadam

సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం …పయ్యావుల కేశవ్

Drukpadam

Leave a Comment