Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో తగ్గేదే లేదంటున్న నేతలు …వ్యూహాలు ,ప్రతి వ్యూహాలు ,ఎత్తులు పై ఎత్తులు!

తగ్గేదే లేదంటున్న నేతలు …వ్యూహాలు ,ప్రతి వ్యూహాలు ,ఎత్తులు పై ఎత్తులు!
-ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో పోటాపోటీగా ర్యాలీలు …
-సత్తుపల్లి నియోజకవర్గంలో పొంగులేటి యాత్రలు
-పాలేరులో తుమ్మల పోటీకి సై …
-కొత్తగూడెంలో జలగం పర్యటనలు

 

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ టీఆర్ యస్ లో అసమ్మతి తారా స్థాయికి చేరింది. తాము ఎంతకాలం నిర్లక్ష్యానికి , అవమానాలకు , అణిచివేతకు , గురికావాలని గురికావాలని అంటున్నారు . తమనే కాకుండా తన అనుచరులను టార్గెట్ చేసి కక్ష రాజకీయాలు చేయడంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు .   ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లే అంటున్నారు .అందుకు అనుగుణంగా    కీలకంగా ఉన్న ముగ్గురు నేతలు రానున్న ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ తయారు చేసుకొంటున్నారు . ముగ్గరు నేతలను ఎదో ఒకచోట ఎకామిడేట్ చేయకపోతే పార్టీ పుట్టి మునగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ముగ్గురు బలమైన నేతలే …వారిలో ఒకరు మాజీ మంత్రి తుమ్మల కాగా , మరొకరు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు ,మరొకరు ఖమ్మం ఎంపీ గా గెలిచి టికెట్ ఇవ్వకపోవడంతో అవకాశం కోసమా ఎదురు చూస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు ముగ్గురే … గత ఎన్నికల్లో ఎమ్మెల్యే లుగా పోటీచేసిన తుమ్మల , జలగం వెంకట రావు లు ఓడిపోయారు … కారణాలు ఏమైనా వారు ఓటమి చెందటం జరిగింది. వారి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిగెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి , వనమా వెంకటేశ్వర రావు లు తరువాత అధికార టీఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు . నాటి నుంచి నియోజకవర్గాల్లో సైతం ఓడిన తుమ్మల , జలగం లకు పట్టు లేకుండా పోయింది. దీంతో వారు పార్టీ కార్యక్రమాలకు సైతం అంటి ముట్టనట్లు గా ఉంటున్నారు . నియోజకవర్గంలో వారి అనుయాయులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు . దీనిపై నేతలు రగులుతున్నారు . అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు .

రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండటంతో తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనే పట్టుదలతో ఉన్నారు . ఈసారి ఆరునూరైనా పోటీచేసి తమ సత్తా చాటాలని అడుగులు వేస్తున్నారు . తుమ్మల పాలేరు నుంచి పోటీకి సిద్ధపడుతుండగా , జలగం కొత్తగూడెం నుంచి పోటీకి సన్నద్ధం అవుతున్నారు . అయితే ఇతర పార్టీలనుంచి వచ్చిన అభ్యర్థులు ఉన్నందున వీరికి అవకాశం ఉంటుందా ? లేదా ? అనే దాందేహాలు లేకపోలేదు . పార్టీ టికెట్ ఇస్తే సంతోషం ఇవ్వకపోయినా పోటీ అనివార్యం అని వారి మద్దతు దార్లు అంటున్నారు . అంటే పార్టీ ఏదైనా పోటీ ఖాయమని అసమ్మతి నేతలు ముందుకు సాగుతున్నారు . టీఆర్ యస్ లో నెలకొన్న అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

టీఆర్ యస్ టికెట్స్ ఇస్తుందా ?

తుమ్మల , జలగం లకు పాలేరు , కొత్తగూడెం లలో తిరిగి టికెట్స్ ఇస్తుందా ? పొంగులేటిని శాసన సభకు అభ్యర్థిగా ఎంపిక చేస్తుందా ? అంటే సందేహమే అంటున్నారు పరిశీలకులు …వీరు బలమైన నేతలు అయినందున మిగతా పార్టీల నుంచి కూడా వీరికి ఆఫర్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో టీఆర్ యస్ ను ఓడించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ , కాంగ్రెస్ లు టీఆర్ యస్ లో ఉన్న అసమ్మతి వాదుల కోసం వల వేస్తున్నాయి . తుమ్మల ,జలగం , పొంగులేటి లాంటి నేతలపై మిగతా పార్టీ లనుంచి తమ పార్టీలో చేరండి అని వత్తిడి ఉన్నది . అయితే టీఆర్ యస్ కాదంటే తమ రాజకీయ భవిషత్ గురించి ఆలోచించుకోవాలనే అభిప్రాయంతో నేతలు ఉన్నారు . తమంత తాముగా పార్టీ మారితే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని , అందువల్ల కేసీఆర్ కాదంటేనే ప్రత్యాన్మాయ మార్గాలు ఆలోచించుకోవాలని నేతలు అభిప్రాయపడుతున్నారు . అయితే వీరు ముగ్గురు కలిసి ఉన్నారా ? అంటే అదీలేదు …ఎవరికీ వారుగానే ఉన్నారు . వీరికి పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. వారి భవిషత్ కూడా చూడాల్సిన భాద్యత నేతలపై ఉంది. అందువల్ల ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ రాజకీయాలు ఆశక్తికరంగా మారె అవకాశాలు ఉన్నాయి. పార్టీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పుట్టిమునగటం ఖాయం …

 

Related posts

స్పీడ్ పెంచిన భట్టి … రైతు భరోసా యాత్రలతో హల్చల్

Drukpadam

తెరాస లోనే కొనసాగుతా… మాజీ ఎంపీ పొంగులేటి పునరుద్ఘాటన !

Drukpadam

పార్టీ నేతలను ఉద్దేశించి రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment