జగన్ పై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు …మండలిలో మంత్రి నారాయణస్వామి మండిపాటు!
-జగన్‌ను ‘వాడూ వీడూ’ అంటావా…లోకేశ్ పై విరుచుకుపడిన డిప్యూటీ సీఎం
-సభలో ఐఎంఎఫ్ఎల్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
-కల్తీ సారా అంటూ చంద్రబాబు పదేపదే ఆరోపణలు చేయడం విడ్డూరమన్న నారాయణస్వామి
-నీకు బుద్ధి ఎప్పుడొస్తుంది? అంటూ లోకేశ్ పై ఆగ్రహం
టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తరుచు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నేడు మండలిలో మండిపడ్డారు . సీఎం ను పట్టుకొని వాడు వీడు అంటావా నీకు బుద్ది ఎప్పుడు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు .
కల్తీ మద్యం, కల్తీ సారా అంటూ చంద్రబాబు పదేపదే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్ కల్తీ సారా వ్యాపారం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మద్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే దాన్ని కూడా విమర్శలు చేయడం టీడీపీకే తగిందని అన్నారు .
చంద్రబాబు రూ.550 కోట్ల మద్యం ముడుపులు స్వీకరించారంటూ ఏసీబీ కోర్టులో కేసు కూడా నడిచిందన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు. ఇక, లోకేశ్‌ను ఉద్దేశించి ‘ఒరేయ్ లోకేశ్ ముం.. నీకు బుద్ధి ఎప్పుడొస్తుంది? మా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకుని వాడూ వీడూ అంటావా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు .మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు . లోకేష్ పై నారాయణ స్వామి వ్యాఖ్యలు సభలో దుమారం లేపాయి.