Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

క్షీణించిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ కు త‌ర‌లింపు

క్షిణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం చికిత్సకోసం ఢిల్లీకి తరలింపు !
-లాలూ గుండె, కిడ్నీలో తలెత్తిన సమస్యలు
-రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
-పశుగ్రాసం కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న లాలూ

రాజకీయ కురువృద్ధుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పశుదాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తూ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి జైల్లో ఉన్నారు . అసలే ఆయనకు ఆరోగ్యం సమస్యలు ఉండటంతో కొద్దీ రోజుల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు . అయితే ఆయన పిటిషన్ ను కోర్ట్ ఏప్రిల్ కు మొదటి తేదీకి వాయిదా వేసింది. జైలులోనే ఉన్న ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మొదట తరలించారు . అక్కడ డాక్టర్ల సూచన మేరకు అక్కడనుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ గుండె, మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తాయని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించినట్టు చెప్పారు. పశుగ్రాసం కుంభకోణం కేసుకు సంబంధించి లాలూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏప్రిల్ 1వ తేదీ వరకు విచారించలేమని ఈ నెల 11న ఝార్ఖండ్ హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఐదో పశుగ్రాసం కుంభకోణంలో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. అంతకుముందు కొంత కాలం బెయిల్ పై ఉన్న లాలూ తిరిగి శిక్ష పడటంతో జైలు కు వెళ్లక తప్పలేదు .లాలూ కుమారుడు తేజశ్వని యాదవ్ బీహార్ లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు . శాసనసభలో లాలూ స్థాపించిన ఆర్జేడీ నే పెద్ద పార్టీ గా ఉండి. పొత్తులో భాగంగా బీజేపీ ,జేడీయూ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. లాలూ ఆరోగ్యం క్షిణించిందనే వార్త బీహార్ ప్రజల్లో ఆందోళనకు గురిచేసింది. రెండు దశాబ్దాల పాటు లాలూ బీహార్ లో తిరుగులేని నాయకుడుగా చక్రం తిప్పారు . కేంద్రంలోను తనదైన ముద్ర వేశారు . బీజేపీ కి వ్యతిరేకంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ,అంతకు ముందు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు లోను లాలూ కీలక పాత్ర వహించారు .

Related posts

దేశంలో 40.87 లక్షల అనుమానాస్పద సిమ్‌కార్డులు.. అందులో 50 వేలకుగాపై ఏపీలోనే!

Drukpadam

కోడలిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన దళిత కుటుంబం…

Drukpadam

వరంగల్ లో జర్నలిస్ట్ లకు 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు…మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Drukpadam

Leave a Comment