Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీకి 40 వసంతాలు…ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు!

టీడీపీకి 40 వసంతాలు…ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు!
-40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు
-ఘనంగా వేడుకలు నిర్వహించాలన్న చంద్రబాబు
-పార్టీ కోసం పునరంకితం అయ్యేలా వేడుకలు ఉండాలని నిర్దేశం

పేదవాడి చమట చుక్కల్లోనుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని స్వర్గీయ ఎన్టీరామారావు ఆవేశ పూరితంగా అన్న డైలాగులు ఇప్పటికి ప్రజల చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆయన ప్రతి ఆవేశం దగాపడ్డ ప్రజలు కోసమే అనే స్ఫూర్తిని రగిలించింది. అందుకే 1982 తెలుగు దేశం ఆవిర్భావం ఒకచరిత్రక ఘట్టంగా నిలిచింది. ఆయన చేసినా బస్సు యాత్ర ప్రజలను పరుగులు ఎత్తించింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టబడింది ఆయన చెప్పిన మాటలు ప్రజల్లో హత్తుకు పోయాయి. ఆయన అధికారం చేపట్టడం పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు .పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు . మండల వ్యవస్థను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ దేశరాజకీయాల్లో సైతం కీలక భూమిక పోషించారు . నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ,ప్రతిపక్షాలను కూడా గొట్టడంలో ఎన్టీఆర్ చూపిన చొరవ చరిత్రలో నిలిచి ఉంటుంది . అప్పుడే టీడీపీ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు .

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని వెల్లడించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు టీడీపీని స్థాపించారని వివరించారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ… తెలుగుదేశం అని స్పష్టం చేశారు. టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రానికి టీడీపీ అవసరం ఏంటో ప్రజలకు వివరించాలని అన్నారు. రాష్ట్ర వ్యాపితంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు .

Related posts

చంద్రబాబు తోలుబొమ్మలాటలో రేవంత్ ఒక బొమ్మ…కేటీఆర్!

Drukpadam

ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి!

Drukpadam

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకోవాలి: కపిల్ సిబాల్ !

Drukpadam

Leave a Comment