Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు దుర్మరణం!

ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు దుర్మరణం!

  • తమిళనాడు వేలూరు జిల్లాలో ఘటన
  • రెండు రోజుల క్రితమే ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న దురై వర్మ
  • ఓవర్ ఛార్జింగ్ కారణంగా పేలిన స్కూటర్

ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు దుర్మరణం పాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రీతి (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం దురై వర్మ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు.

శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రిస్తుండగా… ఓవర్ ఛార్జింగ్ కారణంగా స్కూటర్ పేలిపోయింది. మరో బైకుకు మంటలు అంటుకున్నాయి. పేలుడు ధాటికి పొగలు పెద్దగా కమ్ముకున్నాయి. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని బాత్ రూమ్ లో వారిద్దరూ దాక్కున్నారు. చివరకు ఊపిరి ఆడక ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Related posts

రఘురామ అరెస్ట్ పై భిన్న స్వరాలు…!

Drukpadam

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట-రేవంత్ రెడ్డి పై చార్జిషీటు!

Drukpadam

రాజలింగమూర్తి హత్యలో భిన్న కోణాలు …ఎస్పీ పర్వేక్షణలో దర్యాప్తు ..

Ram Narayana

Leave a Comment