Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గౌత‌మ్‌రెడ్డిని నేనే రాజ‌కీయాల్లోకి తీసు కొచ్చా: సీఎం జ‌గ‌న్

గౌత‌మ్‌రెడ్డిని నేనే రాజ‌కీయాల్లోకి తీసు కొచ్చా: సీఎం జ‌గ‌న్
-నా ప్ర‌తి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నారు
-న‌న్ను ఎల్ల‌ప్పుడూ ప్రోత్స‌హించేవారు
-ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావాల‌ని త‌ప‌న ప‌డేవార‌న్న జ‌గ‌న్
-దానితోనే యువతకు ఉపాధి లభిస్తుందని అనేవారు

నెల్లూరులో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గౌతమ్‌రెడ్డికి జగన్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, త‌న ప్ర‌తి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నార‌ని, త‌న‌ను ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ప్రోత్స‌హించేవార‌ని తెలిపారు. ఆయ‌న‌ను తానే రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చాన‌ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకోని రావాలనే తపన గౌతమ్ రెడ్డి పడేవారని పేర్కొన్నారు . చాల చిన్నవయసు మంచి భవిషత్ ఉన్న నాయకుడని భావించాను . తనకు ఎల్లప్పుడూ ఎంతో అండగా ఉండేవారని నివాళులు అర్పించారు . చనిపోవడానికి కొద్దిరోజుల ముందు దుబాయిలో పర్యటించారని అక్కడ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేందుకు ఒక ఎక్స్ పో ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్నీ గుర్తు చేసుకున్నారు .అక్కడ నుంచి కూడా రోజు తనతో మాట్లాడేవారని అన్నారు . ఒక మంచి సహచరుడు పట్టుదల గల ఒక నేతను కోల్పోవడం బాధాకరంగా ఉందని గౌతమ్ రెడ్డి ఆశలు ,ఆశయాలు ముందుకు తీసుకోని పోవాలని అన్నారు .

ఆరు శాఖలను గౌత‌మ్‌రెడ్డి చూసేవార‌ని ఆయ‌న తెలిపారు. ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావాల‌ని గౌత‌మ్‌రెడ్డి త‌ప‌న ప‌డేవార‌ని, ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తేనే యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అనేవారని జ‌గ‌న్ చెప్పారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాన‌ని, సంగం బ్యారేజ్‌కు ‘మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి బ్యారేజీ’ అనే పేరు పెడ‌తామ‌ని ఆయ‌న తెలిపారు.

Related posts

పదవిలో ఉన్నప్పుడు కాదు.. ఇప్పుడే నేను మరింత ప్రమాదకారిని: ఇమ్రాన్ ఖాన్!

Drukpadam

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

Drukpadam

మరోసారి చైనా బెలూన్ కలకలం… ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!

Drukpadam

Leave a Comment