Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆనిచ్చితిలో లో పాక్ రాజకీయాలు … రాజీనామా దిశగా ఇమ్రాన్ ఖాన్!

ఆనిచ్చితిలో లో పాక్ రాజకీయాలు … రాజీనామా దిశగా ఇమ్రాన్ ఖాన్!
-పాక్ పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం..
-స‌భ‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విప‌క్షాలు
-ఈ నెల 31న తీర్మానంపై చ‌ర్చ‌
-అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా 160 మంది ఎంపీలు
-అంత‌కుముందే రాజీనామా చేసే యోచ‌న‌లో ఇమ్రాన్‌

పాకిస్తాన్ లో రాజకీయాలు అనిశ్చితిగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. అయన గద్దె దిగిపోవాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీలని కొందరు . భాగస్వామ్య పక్షాలనుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అవిశ్వాసం కు ముందే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు ఆయన ఆర్మీ సహాయం కోరారని అందుకు వారు నిరాకరించారని వార్తలు వచ్చాయి. తరువాత రాజీనామా చేసిన వారిపై వేటుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.

పాకిస్థాన్‌లో జరుగుతున్న రాజ‌కీయంగా ప‌రిణామాలు ఇరుగుపొరుగు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. . ఇప్ప‌టికే పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని తీర్మానించిన విప‌క్షాలు..సోమ‌వారం నాడు అన్నంత ప‌నీ చేశాయి. పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ స‌ర్కారుపై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 160 మంది ఎంపీలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆ దేశ ప‌త్రిక‌లు క‌థ‌నాలు రాశాయి.

ఇదిలా ఉంటే..సోమ‌వారం పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 31న చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. అయితే ఆ తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చేలోగానే ఇమ్రాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు కూడా గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. ఓ వైపున విపక్షాల‌తో పాటుగా త‌న సొంత పార్టీకి చెందిన ప‌లువురు ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధ‌మ‌వ‌గా.. ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు మాత్రం ఇమ్రాన్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుండటం విశేషం .

Related posts

ఎన్నికలకు ముందు… మమత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు భారీ షాక్

Drukpadam

ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశం…ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు!

Drukpadam

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు!

Drukpadam

Leave a Comment