Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటీఆర్ యస్  ఎమ్మెల్యేలు ఎందరు?
-పీకే లెక్క ప్రకారం 8  మందిలో అందరికి టికెట్స్ వస్తాయా ?
-సర్వే రిపోర్టుల తో …ఎమ్మెల్యేల్లో టెన్షన్ ,టెన్షన్ …
-పార్టీలు మారిన ఎమ్మెల్యేపై ప్రజల్లో ఆశక్తికర చర్చ

పీకే …అంటే ప్రశాంత్ కిషోర్ …ఎన్నికల వ్యూహకర్త … దేశంలోనే పేరున్న వాడుగా గుర్తింపు ఉంది …అనేక ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యాలు నిజమైయ్యాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆయన టీంలు పని చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కేసీఆర్ హామీ ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకే టికెట్స్ అనే విశ్వాసం తో ఉన్నారు . పీకే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వద్దని చెప్పారు . దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ …ప్రారంభమైంది. సర్వే లో మాపనితీరుపై ఎలాంటి ఫలితాలు వస్తాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి గెలిచింది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే . మిగతా వారిలో వైరా నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన రాములు నాయక్ టీఆర్ యస్ తీర్థం పుచ్చుకోగా , కాంగ్రెస్ నుంచి గెలిచినా కందాల , హరిప్రియ ,వనమా వెంకటేశ్వరరావు ,రేగా కాంతారావు లు కూడా టీఆర్ యస్ లో చేరారు . ఇక తెలుగు దేశం నుంచి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య , అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు లు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ యస్ లో చేరారు . దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కరుగా ఉన్న టీఆర్ యస్ ఎమ్మెల్యేలు 8 మంది అయ్యారు . ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు .

ఇప్పుడు 8 మంది టీఆర్ యస్ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేదానిపై ఆశక్తి నెలకొన్నది . పీకే లెక్క ప్రకారం ఇందులో కచ్చితంగా ముగ్గురు నుంచి నలుగురిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ ఇస్తామని అన్నడంతో ఎమ్మెల్యేల్లో తమకే టికెట్స్ అనే విశ్వాసం ఉన్న పీకే లెక్క తేడా కొడుతుందా అనే సందేహాలు లేకపోలేదు . ప్రజల్లో వ్యతిరేకత కు గీటురాయి ఏమిటి ? ప్రజలను మెప్పించడం వారి నుంచి వ్యతిరేకత లేకుండా చూసుకోవడం ఎలా ? అనే ఆలోచనలో ఎమ్మెల్యే లు పడ్డారు . అందుకోసం ఆరా తీస్తున్నారు. పాలేరు లో అయితే టీఆర్ యస్ లో రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు ప్రజల్లో పైచేయి సాదించేందుకు వ్యూహాలు ,ప్రతివ్యూహాలు పన్నుతున్నారు . ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు . సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా ,గత ఎన్నికల్లో టీఆర్ యస్ తరుపున పోటీచేసి ఓడిపోయినా మాజీమంత్రి తుమ్మల నేను పోటీచేస్తున్నానని నియోజకవర్గాన్ని చుట్టివేస్తున్నారు .
ఖమ్మం లో ఇప్పటికైతే మంత్రి అజయ్ టికెట్ కు డోకాలేదు . ఖమ్మం నియోజకర్గాన్నిబాగా అభివృద్ధి చేశారనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన పట్ల మొదట ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుందని అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల నాటికీ మరింత మారితే ఆయనకు తిరుగు ఉండక పోవచ్చు . వైరా నియోజకవర్గంలో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అధికార టీఆర్ యస్ చేరారు . నియోజకవర్గంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి పోటీచేసిన మదన్ లాల్ కూడా నియోజకర్గం పై ఆశలు పెట్టుకున్నారు. ఇల్లందు నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టీఆర్ యస్ లో చేరిన హరిప్రియకు స్థానిక టీఆర్ యస్ నేతలతో సఖ్యత లేదని సమన్వయ లోపం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. కొత్తగూడెం నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రాజకీయ కురువృద్ధుడు వనమా పై ప్రజల్లో మంచి పేరే ఉన్నా , ఆయన కుమారుడు రాఘవ పై ఉన్న వ్యతిరేకత మైనస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పినపాక నియోజవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు డైనమిక్ గా వ్యవహరిస్తాడనే పేరుంది. అయితే పార్టీ మార్పు తో పాటు ఆయన డైనమిజం మైనస్ గా మారుతుందా ? అనే చర్చ జరుగుతుంది. పార్టీలోని వైరి గ్రూపులతో సంబంధాలు లేకపోవడం కూడా కొంత ఇబ్బందిగా ఉంది. ఇక తెలుగు దేశం నుంచి టీఆర్ యస్ లో చేరిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్న అక్కడ గ్రూప్ రాజకీయాలు ,సొంత పార్టీ వారితో సఖ్యత లేకపోవడం పై ద్రుష్టి సారించాల్సి ఉంది. ఇక అశ్వారావు పేట మెచ్చా నాగేశ్వరరావు తెలుగు దేశం నుంచి గెలిచి టీఆర్ యస్ చేరారు . పార్టీ మార్పు మైనస్ గా ఉంది. ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. అందువల్ల సిట్టింగ్ లాలలో పీకే లెక్క ప్రకారం ఎవరికి టికెట్స్ వస్తాయి . ఎవరికీ రావు అనేది ఆశక్తిగా మారింది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రతి నియోజకర్గంలో వాతావరణం మారిపోయింది. ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇప్పుడు పీకే టీం లు తమమనితీరు ప్రజల్లో ఉన్న సంబంధాలపై ఎలాంటి నివేదిక ఇస్తారోననే సందేహం తో ఎమ్మెల్యేలు ఉన్నారు . చూద్దాం ఏమిజరుగుతుందో ….

 

Related posts

ఖమ్మం లో సాయి గణేష్ ఆత్మహత్య పూర్వాపరాలు…

Drukpadam

మ‌హారాష్ట్ర సీఎం ప‌ద‌వికి ఉద్ధ‌వ్ థాక‌రే రాజీనామా!

Drukpadam

కడప చేరుకున్న చంద్రబాబు.. పోటెత్తి వచ్చిన టీడీపీ శ్రేణులు

Drukpadam

Leave a Comment