Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ సమరం లో పార్టీల ఎత్తులు పై ఎత్తులు…

సాగర్ సమరం లో పార్టీల ఎత్తులు పై ఎత్తులు…
-ఇంకా ఖరారు కాని టీఆర్ యస్ ,బీజేపీ అభ్యర్థులు
-ప్రచారంలో టీఆర్ యస్ ,కాంగ్రెస్ పోటాపోటీ

ఏప్రిల్ 17 న జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ ,టీఆర్ యస్ ,బీజేపీ లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇంకా టీఆర్ యస్ ,బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరగలేదు. ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ యస్ పోటాపోటీగా ఉన్నాయి. టీఆర్ యస్ కు చెందిన వివిధ నియోజవర్గాల ఎమ్మెల్యేలు ఇక్కడ మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.మంత్రులను , ఇంచార్జిలుగా నియమించారు. ఎన్నికల స్పెషలిస్టులుగా పేరొందిన కేటీఆర్ ,హరీష్ రావు, జగదీష్ రెడ్డి ,గుత్తా సుఖేందర్ రెడ్డి , పల్లా రేజేశ్వర్ రెడ్డి లాంటి వారు ప్రచారంలో పాల్గొంటారని టీఆర్ యస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి హేమ హేమీలైన నాయకులూ నల్లగొండలోనే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచే పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్య నాయకులంతా రంగంలోకి దిగనున్నారు. సాగర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కేసీఆర్ వచ్చి హాలియాలో పెద్ద బహిరంగ సభ పెడితే , కాంగ్రెస్ శుక్రవారం రోజున హాలియాలో బహిరంగసభ పెట్టింది. జెండా ఉన్నా ఏ జెండా ఏమిటి అనేది పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డి ని ఢీకొనేందుకు అధికార టీఆర్ యస్ తో పాటు బీజేపీ సిద్ధపడుతున్నాయి. సాగర్ లో పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన జానారెడ్డి కి నిజాయతి గల సమర్ధుడైన, మచ్చలేని రాజకీయ నాయకుడుగా పేరుంది. సాగర్ నియోజకవర్గ అభివృద్ధిలో జానారెడ్డి పాత్ర కాదనలేని వాస్తవం . జానారెడ్డికి అక్కడ ప్రస్తుతం అడ్వాంటేజ్ ఉంది అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి . అధికార టీఆర్ యస్ పార్టీ దివంగత నేత నోముల నరసింహయ్య కుమారుడు భరత్ తో పాటు మల్లయ్య యాదవ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ యాదవ సామాజిక వర్గం ఓట్లు 40 వేల వరకు ఉంటాయని అంచనా . ఎస్టీ లంబాడా ఓట్లు కూడా అంతే సంఖ్యలో ఉన్నాయి. అయితే రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. అందుకే జానారెడ్డి టార్గట్ గా పార్టీలు ప్రచారానికి పదును పెడుతున్నాయి. టీఆర్ యస్ , కాంగ్రెస్ లకు చెప్పుకునేందుకు కొంత ఉన్నా బీజేపీకి ఏమిలేదు. కేంద్రంలో మోడీ నాయకత్వం ,అధికారం గురించి చెపితే ఓట్లు రాలవు. అందుకే వారు బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. జరుగుతున్నది కేవలం ఎమ్మెల్యే సీటు కోసం ఎన్నిక , బీజేపీ ఏమని ఓట్లు అడుగుతుంది ప్రచారం ఏమి చేస్తారు. గతంలో లాగానే రాష్ట్ర ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు గుప్పించి కేసీఆర్ పరిపాలన పై విమర్శలు చేయటం సహజంగా జరిగేదే . కాని రాష్ట్రానికి రావాల్సిన నిధుల ఇవ్వటంలో కేంద్రం ఇబ్బందులు పెడుతుందని అపవాదు ఉంది. దానికి తోడు విభజన చట్టంలో హామీల అమలు చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వం నెట్టి నోరు మొత్తుకొంటుంది. దీనిపై పార్లమెంట్ లో అనేక సందర్బాలలో చర్చజరిగింది. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయని వాటిని మీరే తేల్చికోవాలని మాదగ్గర పెండింగ్ హామీలు ఏమిలేవని చెప్పేప్రయత్నాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోని లోకసభ సభ్యులు పార్టీలకతీతంగా ఖండించారు. దీనిపై మొదట స్పందించిన టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. ముఖ్యమంత్రుల మధ్య ఉన్న స్రుహుద్బవ వాతావరణాన్ని చెప్పారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖంగు తిన్నది. అందువల్ల కయ్యం పెట్టి లబ్ది పొందాలనే బీజేపీ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక ఉప ఎన్నికల్లో ఏమి చెప్పాలనే ఆలోచనలకు బీజేపీ నేతలు పదును పెడుతున్నారు. అంతే కాకుండా అభ్యర్థుల ఎంపికలోనూ పోటీనెలకొన్నది. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ నివేదితారెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు . మరో నాయకుడు అంజయ్య యాదవ్ కూడా ఉన్నారు. నివేదితారెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఆమెకు టికెట్ వస్తుందా ? రాదా ? అనేది ఇంకా స్పష్టం కాలేదు. నామినేషన్లు వేసేందుకు ఈ నెల 31 చివరి తేదీ .అందువల్ల టీఆర్ యస్ బీజేపీ లో ఎవరికీ టిక్కెట్లు దక్కుతాయి అనేది ఈరోజు లేదా రేపు తేలే ఆవకాశం ఉంది. రెండు పార్టీల అభ్యర్థులు ఫైనల్ అయితే ప్రచారం ఆశక్తి కరంగా ఉంటుంది. చూడాలి మరి సాగర్ దంగల్ ఎలా ఉంటుందో మరి !!!

Related posts

టీవీ5 వేదికగా చర్చకు రావాలంటూ ఉండవల్లికి జీవీ రెడ్డి సవాల్… చర్చకు రెడీ అన్న ఉండవల్లి…

Drukpadam

నయీంకే భయపడలేదు.. నీకు భయపడతానా?: సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ ఫైర్​!

Drukpadam

మరాఠా యోధుడు …ఎన్నికల వ్యూహకర్త మధ్య ఏంజరుగుంది ?

Drukpadam

Leave a Comment