జర్నలిస్టులకు షాక్….వాహనం పై ప్రెస్ స్టిక్కర్ వేస్తే రూ.1000 ఫైన్…..
-పోలీస్ డ్రైవ్ లో జర్నలిస్టులకు తప్పని తిప్పలు
-అక్రిడేషన్ కార్డు ఉంటె వదలాలని జర్నలిస్ట్ సంఘాల డిమాండ్
-రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేస్తున్న జర్నలిస్టులు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు జర్నలిస్టులను టార్గెట్ చేశారు . ప్రెస్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లు, పోలీస్ స్టిక్కర్లను తొలగించే పనిలో నిమగ్నమైన హైదరాబాద్ పోలీసులు వాటిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టారు . ప్రతి బండిని ఆపి చెక్ చేస్తున్నారు . ఇంతవరకు బాగానే ఉన్నా 24 డ్యూటీ లో ఉంది సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల వాహనాలపై ఫైన్ వేయడం దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నిజమైన జర్నలిస్టులు అని నిర్దారించుకుని వదిలి పెట్టాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి. కొంతమంది జర్నలిస్టులు కాకపోయినా ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు అనేది పోలిసుల ఆరోపణ ఆలాంటి వారిపై చర్యలు తీసుకుంటే తప్పులేదని కానీ నిజమైన జర్నలిస్టులు కు ఫైన్ వేసి ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తుత్తిగా ఇలాంటి స్టిక్కర్లు బండ్ల మీద అతికించుకుని తిరిగే వాళ్లకు ఫైన్ వేయాల్సింది.. నిజమైన జర్నలిస్టులకు వేస్తూ ఇబ్బందులు పెట్టడంపై జర్నలిస్ట్ లోకం పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నది . అనేక సందర్భాలలో పోలీసులతో సమానంగా డ్యూటీలు చేస్తూ సమాజ హితం కోసం పని చేస్తున్న జర్నలిస్టుల వాహనాలకు ఫైన్ లు వేయకుండా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి.
అసలు సిసలైన జర్నలిస్టులను పట్టుకుని.. బండికి ప్రెస్ స్టిక్కర్ వేసుకున్నావు కాబట్టి రూ.700 ఫైన్ కట్టు అని దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక నుంచి ప్రెస్ స్టిక్కర్లు కనిపిస్తే.. రూ.700 కట్టాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డును చూపించినా.. వినడం లేదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఓ ప్రముఖ జర్నలిస్టుకు ఫైన్ వేసి తమ అధికారాన్ని చూపించారు పోలీసులు. అతడు అన్ని ఫ్రూప్స్ చూపించినా.. వినకుండా ఫైన్ వేశారు. జర్నలిస్టు అంటేనే.. 24 గంటల డ్యూటీ. ఓ అర్థరాత్రి రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. అలాంటి సమాజ సేవ చేసే వారిపై ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఏంటని సాటి జర్నలిస్టు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికైనా ఈ కొత్త రూల్స్ నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని పాత్రకేయ లోకం పోలీస్ ఉన్నతాధికారులను కోరుతోంది.