Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో కొత్త జిల్లాల‌కు కేబినెట్ ఆమోదం…

ఏపీలో కొత్త జిల్లాల‌కు కేబినెట్ ఆమోదం!

-ఏప్రిల్ 4న‌ ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం.. ముహూర్తం ఖ‌రారు
-13 కొత్త జిల్లాల‌తో పాటు 22 రెవెన్యూ డివిజ‌న్లు కూడా
-ఏపీలో ఇక నుంచి జిల్లాలు 26 రెవెన్యూ డివిజ‌న్ల ,౭౦
-రెవిన్యూ డివిజన్ గా చంద్రబాబు నియోజకవర్గం కుప్పం
-ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర‌ ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాలో పాలన

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి లాంఛ‌నాల‌న్నీ వ‌రుస‌గా జ‌రిగిపోతున్నాయి. ఇప్ప‌టికే బుధ‌వారం ఉద‌యం కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌కు సంబంధించిన సీఎం జ‌గ‌న్ ముహూర్తాన్ని ఖ‌రారు చేయ‌గా.. కాసేప‌టి క్రితం భేటీ అయిన ఏపీ కేబినెట్ కొత్త జిల్లాల‌కు ఆమోదం తెలిపింది.

ఈ మేర‌కు జ‌గ‌న్ నేతృత్వంలో స‌మావేశమైన ఏపీ కేబినెట్ కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాల‌తో పాటు 22 కొత్త డివిజ‌న్ల‌కు కూడా ఆమోదం తెలుపుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల సంఖ్య 26కు చేరుకోనుండ‌గా..రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య 70కి చేర‌నుంది.

కేబినెట్ ఆమోదం తెలిపిన మేర‌కు ఏపీలో జిల్లాల పేర్లు ఇలా ఉన్నాయి.
1 . శ్రీకాకుళం
2 . విజయనగరం
3 .విశాఖపట్నం
4. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా
5. అల్లూరి జిల్లా
6. అన‌కాప‌ల్లి జిల్లా
7 .తూర్పు గోదావరి
8. కోన‌సీమ జిల్లా
9. రాజ‌మండ్రి జిల్లా
10 .పశ్చిమ గోదావరి
11. న‌ర‌సాపురం జిల్లా
12 .ఎన్టీఆర్ విజ‌య‌వాడ జిల్లా
13 .కృష్ణ (బందర్ )
14 .గుంటూరు
15. బాప‌ట్ల జిల్లా
16. న‌ర‌సరావుపేట జిల్లా
17 .ప్రకాశం
18 .నెల్లూరు
19. తిరుప‌తి
20 .చిత్తూరు
21. అన్న‌మ‌య్య జిల్లా
22 .వైయస్సార్ కడప
23 .కర్నూల్
24. నంద్యాల జిల్లా
25. అనంతపురం
26 .స‌త్య‌సాయి జిల్లా

ఏప్రిల్ 4న‌ ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం.. ముహూర్తం ఖ‌రారు

ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం ఖ‌రారైంది. ఏప్రిల్ 4న ఉద‌యం 9.05 గంట‌ల నుంచి 9.45 గంట‌ల మ‌ధ్య‌లో కొత్త‌గా ఏర్పాటు కానున్న అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌ను ప్రారంభించాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయిన సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాలు ప్రారంభించ‌డానికి ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు. ఈ ముహూర్తానికే సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాల‌ను ప్రారంభిస్తారు.

ఏపీలో కొత్త‌గా అందుబాటులోకి రానున్న జిల్లాల‌తో క‌లిపి మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకోనుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 13 జిల్లాల‌తో కొత్త ప్ర‌స్థానం ప్రారంభించిన ఏపీ.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యంతో 26 జిల్లాల‌తో సాగ‌నుంది. ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానంటూ 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేరకు జిల్లా ఏర్పాటుకు ఏపీ కాబినెట్ పచ్చ జెండా ఊపింది.

Related posts

మరియమ్మ హత్యపై ముఖ్యమంత్రి స్పందిక పోవడం సిగ్గుచేటు: సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …

Drukpadam

మేం నమ్మిన వాళ్లే అవసరానికి మమ్మల్ని ఆదుకోలేదు: ప్రధాని నరేంద్ర మోదీ..!

Drukpadam

Leave a Comment