Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి? ముందుగా మంత్రి పదవి??

ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి? ముందుగా మంత్రి పదవి??
-శ్రీకీర్తిని బరిలోకి దించాలని యోచిస్తున్న వైసీపీ అధిష్ఠానం
-ఏ నిర్ణయమూ తీసుకోని మేకపాటి కుటుంబ సభ్యులు
-శ్రీకీర్తి బరిలోకి దిగితే పోటీ నుంచి తప్పుకోనున్న టీడీపీ!

ఇటీవల హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గౌతంరెడ్డి మృతితో ఖాళీ అయిన నెల్లూరు జల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో శ్రీకీర్తిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉంది. ఈలోగానే ఆమెను రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలాఉంటుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, మేకపాటి కుటుంబం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెబుతున్నారు. పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి నుంచి ఇంతవరకు ఎలాంటి కామెంట్ రాలేదు . అయితే ఆయన కూడా నో అని చెప్పకపోవచ్చుననే అభిప్రాయాలే ఉన్నాయి. గౌతమ్ రెడ్డి కుమారుడు విదేశాలలో ఉన్నారు . ఆయనకు రాజకీయాలపట్ల అంతగా ఆశక్తి లేదని అంటున్నారు.

వైసీపీ కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న సంప్రదాయం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంది. ఆత్మకూరు విషయంలోనూ అదే పాటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన కూడా పోటీపెట్టే అవకాశం లేదని అంటున్నారు . ఇక బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వారి కేంద్ర నాయకత్వం నిర్ణయించాల్సి ఉంది. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు.

Related posts

పెద్ద ఇంజనీర్ కేసీఆరే అందుకే కాళేశ్వరం పంపు హౌసులు మునిగాయి…ఈటల

Drukpadam

ఖమ్మం సభలో బీజేపీ పై నిప్పులు చెరిగిన కేరళ సీఎం పినారై విజయన్!

Drukpadam

ఈ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి పోలవరానికి శాపం: నిమ్మల రామానాయుడు!

Drukpadam

Leave a Comment