Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీకే వ్యూహాలు ,కేసీఆర్ రాజకీయ చతురత ప్రత్యర్థులు తట్టుకోగలరా ?

పీకే వ్యూహాలు ,కేసీఆర్ రాజకీయ చతురత ప్రత్యర్థులు తట్టుకోగలరా ?
-టీఆర్ యస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
-ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో ముందుకు
-ఇప్పటికే కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్
-బీజేపీకి ప్రత్యాన్మయం కోసం ఎత్తులు …వివిధ రాష్ట్రాలలో పర్యటనలు

ప్రశాంత కిషోర్ దేశవ్యాపితంగా మరోమోగుతున్నపేరు …ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట . ఇప్పుడు టీఆర్ యస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు . రాజకీయ చాణిక్యుడుగా పేరొందిన కేసీఆర్ , ఎన్నికల వ్యూహాల్లో తిరుగులేని ప్రశాంత కిషోర్ కలిశారు . వారి వ్యూహాలకు పదును పెడుతున్నారు .ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు . వాటిముందు ప్రత్యర్థులు తట్టుకోగలరా ? అనే ఆశక్తి నెలకొన్నది . కేంద్రంపై యుద్ధం ప్రకటించిన రాజకీయచాణిక్యుడు కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీజేపీ యేతర శక్తులను ఏకం చేసే పనిలో ఉన్నారు . ఇప్పుడు ఇద్దరు ఉద్దండుల కలయికతో ప్రత్యర్థులు తట్టుకోగలరా ? అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆశక్తిగా మారింది .

పీకే సలహాలకోసం అనేక రాజకీయపార్టీలు ఆరాటపడుతుంటాయి. తాము ఎలా చేస్తే ఎన్నికల్లో గెలవగలం …అందుకు ఏమి చేయాలి …ఎలాంటి వాగ్దానాలు ఇవ్వాలి …ప్రత్యర్థులను చిత్తూ చేసేందుకు ఎలాంటి ఎత్తుగడలు అవలంబించాలి అనేవాటిపై పీకే ఇచ్చే సలహాలు పాటించి సక్సెస్ అయినవారు అనేక మంది ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు , తెలంగాణాలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు . ఆయన టీంలు ఆయారాష్ట్రాలలో పనిచేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంలో పీకే సలహాలే కీలకం అని అంటారు .

2021 లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ , టీఎంసీ కి మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో పీకే మమతా బెనర్జీ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవరించారు . బీజేపీ హేమ హేమీలు ప్రధాని ,హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా , పలువురు కేంద్ర మంత్రులు , ప్రచారం చేశారు . బెంగాల్ లో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు . టీఎంసీ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు . కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం టీఎంసీ అధికారంలో కి రావడమే కాదు బీజేపీకి డబల్ డిజిట్ అంకె దాటితే తాను ఇకనుంచి ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు . ఆయన అన్నట్లుగానే బీజేపీ 70 పైగా సీట్లు మాత్రమే వచ్చాయి. మమతా నాయకత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది.

ఇప్పుడు పీకే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తుండటంపై ప్రత్యర్థులు అవహేళన చేస్తున్నారు . పీకే ఏమి చేస్తారు ఇక్కడ ప్రజల అభిమానం లేకుండా అని అంటున్నారు . అయినప్పటికీ కేసీఆర్ పీకే ను రంగంలోకి దింపారు . ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీద ఒక అవగాహన ఏర్పరుచుకున్న పీకే తన టీంను పనిలోకి దింపారు . వారు వివిధ జిల్లాల్లో రహస్యంగా సర్వే లు చేస్తున్నారు . కేసీఆర్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు రాష్ట్రంలో ప్రజల నుంచి మద్దతు ఉందని కొన్ని సర్వే సంస్థలు నిర్వహించిన సర్వే లో 30 నియోజకర్గాలలో 29 సీట్లు గెలుస్తున్నామని చెప్పారు . అయితే ఈ సర్వే నిజమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకుముందు ఒక సర్వే వచ్చిందని వార్తలు షికార్లు చేశాయి. అందులో టీఆర్ యస్ కు చాల తక్కువసీట్లు వస్తున్నాయని ఆ సర్వే సారాంశం . ఈ సర్వేలు ఎవరికి అనుకూలంగా వారు ప్రచారం చేసుకుంటున్నారు . 2023 ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లలో మేమె గెలవబోతున్నామని కేసీఆర్ చెపుతుండగా , మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ డంఖా బజాయిస్తుంది. కాంగ్రెస్ అధికారం మాదే అని అంటున్నది .

ఇప్పటికైతే తెలంగాణ లో బీజేపీ కి అధికారంలోకి వచ్చేంత బలం లేదనే అభిప్రాయాలే ఉన్నాయి. . కానీ వివిధ పార్టీల నుంచి అనేక మంది ముఖ్యనేతలు తమ పార్టీలో చేరబోతున్నారని బీజేపీ ప్రచారం చేస్తున్నది . అందుకోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలలో ఉన్న అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నది . త్రిపుర ఫార్మాలతో వారిని నాయన భయానా లొంగదీసుకోవాలని పధక రచన చేస్తుంది బీజేపీ. ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుంది,ఎంతమంది బీజేపీలో చేరతారు ప్రజలు బీజేపీని ఎంతవరకు ఆదరిస్తారు అనేదానిపై ఆధారపడి వారి గెలుపోటములు ఉంటాయి. ఏది ఎలా ఉన్న పీకే టీం రంగంలోకి దిగటం అధికార పార్టీ ఇంట బయట చర్చనీయాంశంగా మారింది…..

Related posts

కాంగ్రెస్ ఓట్లను చీల్చే పార్టీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి విసుర్లు!

Drukpadam

కాంగ్రెస్ మరో షాక్ … మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ గుడ్ బై ,బీజేపీ లో చేరిక…

Drukpadam

అంబటి రాయుడిపై అమరావతి రైతుల ఆగ్రహం

Ram Narayana

Leave a Comment