Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాగర్ బరిలో సానుభూతికే కేసీఆర్ మొగ్గు

  • నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక
  • టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఖరారు
  • తెలంగాణ భవన్ లో భగత్ కు బీ-ఫారం అందజేత
  • ఆశీస్సులు అందించిన సీఎం కేసీఆర్
  • -ప్రయోగాలు చేస్తే లాభం లేదనే నివేదికలు
  • యాదవుల ఓట్లు గంపగుత్తగా పడతాయనే ఆశ
CM KCR gives B Farm to Nomula Bhagat Kumar

నాగార్జున సాగర్ బరిలో కేసీఆర్ ప్రయోగాలు చేయకుండా సానుభూతు వైపే మొగ్గుచూపారు. దివగంత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు భగత్ ను టీఆర్ యస్ అభ్యర్థిగా ఖరారు చేశారు.వెంటనే బి .ఫామ్ కూడా అందజేశారు. చాల రకాలుగా ఆలోచనలు చేసిన కేసీఆర్ చివరకు భగత్ ను ఎంచుకోవడంలో కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీమంత్రి సీనియర్ నేత జానారెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన అక్కడ పరిచయం లేని వ్యక్తి ,జగమెరిగిన బ్రామ్మణుడు అందువల్ల ఆయన్ను ఢీకొనాలంటే ఇప్పుడు ప్రయోగాలు చేయడం సరైంది కాదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు ఉన్నారు.దానికి తోడు ఇంటలిజన్స్ నివేదికలు కూడా ఎవరికీ ఇచ్చిన జానారెడ్డికి సానుభూతి ఉందని అందువల్ల కొత్త వాళ్ళని పెడితే ఇబ్బందులు తప్పవని చెప్పటంతో భగత్ కి టికెట్ ఇవ్వక తప్పలేదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ యాదవుల ఓట్లు సుమారు 40 వేల పైచిలుకు ఉన్నాయి. అవుట్ల మీద నమ్మకం పెట్టుకున్నారు. అయితే యాదవుల్లో కూడా టికెట్ ఆశించినవాళ్లు ఉన్నారు. కాని వారికీ ఇస్తే నోముల కుటుంభం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చివరి నిమిషం వరకు ఆలోచన చేసిన టీఆర్ యస్ సీటు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నోముల కుమారుడిని బరిలోకి దింపిందని అంటున్నారు. పరిశీలకులు .  తాజాగా నోముల భగత్ కుమార్ కు సీఎం కేసీఆర్ బీ-ఫారం అందజేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ కు బీ-ఫారం అందించిన కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో  నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ తరఫున కంకణాల నివేదితా రెడ్డి బరిలో దిగుతారని భావిస్తున్నారు. ఇదిలావుంచితే, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.

Related posts

మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదు: బొత్స

Drukpadam

ఏపీలో పంచాయతీ ఎన్నికల కయ్యం…

Drukpadam

అసెంబ్లీలో సహనం కోల్పోయిన బీహార్ సీఎం!

Drukpadam

Leave a Comment