Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పబ్బులపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారుల చర్యలు?..

పబ్బులపై దాడి చేసిన పోలీసులపై ఉన్నతాధికారుల చర్యలు.. అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణ, ఏపీ మాజీ ఎంపీల కుమారులు?

  • మాజీ డీజీపీ కూతురు కూడా ఉన్నట్టు అనుమానం
  • ఏసీపీ సుదర్శన్ కు మెమో జారీ
  • బంజారాహిల్స్ సీఐ సస్పెండ్
పబ్ లపై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏసీపీ, సర్కిల్ ఇన్ స్పెక్టర్ లపై చర్యలు పూనుకున్నారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చిన ఉన్నతాధికారులు.. బంజారాహిల్స్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివచంద్రను సస్పెండ్ చేశారు.

కాగా, నిన్న రాత్రి బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్, పుడింగ్ అండ్ మింక్స్ పబ్ లపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 144 మందిని అరెస్ట్ చేశారు. అందులో సినీ నటి నిహారిక, సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ లూ ఉన్నారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి పంపించిన సంగతి తెలిసిందే. ఆ పబ్ ల నుంచి పోలీసులు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో దాదాపు అందరూ ప్రముఖుల పిల్లలే కావడం, ఇప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. పబ్ లో మాజీ డీజీపీ కూతురు, ఏపీకి చెందిన మాజీ ఎంపీ కుమారుడు, తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేల కుమారులున్నట్టు తెలుస్తోంది. పబ్ లో లిక్విడ్ రూపంలోనూ డ్రగ్స్ దొరికినట్టు తెలుస్తోంది. అయితే, 12 మందిని మినహా మిగతా అందరికి పోలీసులు నోటీసులిచ్చి పంపించినట్టు తెలుస్తోంది.

Related posts

అన్న కొడుకు పెళ్ళిలో అంతా తానై వ్యవహరించిన మంత్రి పువ్వాడ అజయ్ …

Drukpadam

కరోనా తర్వాత నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది: సజ్జనార్‌

Drukpadam

పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి…డీజీపీ మహేందర్ రెడ్డి…

Drukpadam

Leave a Comment