Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నా కూతురికి ఆ పబ్ కు ఎలాంటి సంబంధం లేదు :రేణుక చౌదరి!

నా కూతురికి ఆ పబ్ కు ఎలాంటి సంబంధం లేదు :రేణుక చౌదరి!
-తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు
-పాత్రికేయ విలువలు పాటించండి
-ఆ పబ్ నా కూతురుది అంటున్నారు
-నిర్దారణ చేసుకొని నిజాలు ప్రసారం చేయండి
-గతరాత్రి పుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు
-అనేకమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-ఆ పబ్ రేణుకా చౌదరి కుమార్తెదంటూ ప్రచారం
-ఓ ప్రకటనలో ఖండించిన రేణుకా చౌదరి

హైద్రాబాద్ పబ్ పై పోలీసులు జరిపిన దాడిలో అనేకమంది ప్రముఖుల పిల్లలు అందులో ఉన్నారు వారినందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరు ప్రముఖుల పిల్లలు ఉండటం అక్కడ డ్రగ్స్ వాడుతున్నట్లు ప్రచారం జరగటం, నిర్దారిత సమయానికి పబ్ మూయకపోవడం తో పబ్ లో జరుగుతున్నా కార్యకలాపాలపై అనేక అనుమానాలు ఉన్నాయి.పోలిసుల రైడ్ లో 148 మంది అబ్బాయిలను అమ్మాయిలను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు వారి అడ్రస్ లు తీసుకోని వదిలారు . అప్పుడు పబ్ లో బిగ్ బాస్ విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ,నాగబాబు కుమార్తె నిహారిక ,ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు , మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్ కుమారుడు , రేణుక చౌదరి కుమార్తె తేజశ్వని ,సినీ యాక్టర్ హేమ , లాంటి ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి కూతురు తేజశ్వనిదే ఆ పబ్ అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కొందరు తమ పిల్లలు అక్కడికి వెళ్లిన ఫ్రెండ్ బర్తడే పార్టీ ఉన్నందున వెళ్లారే తప్ప మా వాళ్లకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని ఖండించారు . రేణుక చౌదరి పబ్ తనకూతురిదనే ప్రచారం పై ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచారం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు . నిజాలు తెలుసుకొని ప్రసారం చేయండని అన్నారు

హైదరాబాదులోని పుడింగ్ మింక్ పబ్ పేరు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. గతరాత్రి ఆ పబ్ పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం పాటు, అనేకమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరిదంటూ ప్రచారం జరిగింది. దీనిపై రేణుకా చౌదరి ఓ ప్రకటన చేశారు.

“పోలీసులు హైదరాబాదు రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ బార్ పై దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ మా అమ్మాయి తేజస్విని చౌదరిదని పేర్కొన్నాయి. అంతేకాదు, పోలీసులు ఆమెను నిర్బంధించారని, ప్రశ్నిస్తున్నారని కూడా ఆ మీడియా వర్గాలు ప్రచారం చేశాయి. దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కు మా అమ్మాయి యజమాని కాదు. అసలా పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు.

పైగా, పోలీసులు దాడులు చేసిన ఏప్రిల్ 2వ తేదీన మా అమ్మాయి ఆ పబ్ లో లేనేలేదు. అలాంటప్పుడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం జరగని పని. ఈ సందర్భంగా నేను మీడియా సంస్థలను కోరేదేమిటంటే… కనీస పాత్రికేయ విలువలు పాటించండి. వార్తలు ప్రసారం చేసేముందు ఓసారి వాస్తవాలు నిర్ధారించుకోండి. మీ సంచలనాత్మక కథనాల కోసం ప్రైవేటు వ్యక్తుల పేర్లను బయటికి లాగే ప్రయత్నం చేయొద్దు” అంటూ రేణుకా చౌదరి హితవు పలికారు.

Related posts

ఏముంది నా దగ్గర ఇవ్వడానికి?: కాంగ్రెస్ లో చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Ram Narayana

శ్రీలంకలో సైనికులు, పోలీసుల మధ్య ఘర్షణ…

Drukpadam

‘స‌లాం తాలిబ‌న్స్’ అంటూ పాక్ లో బాలిక‌లతో బ‌ల‌వంతంగా గీతం పాడించిన వైనం..

Drukpadam

Leave a Comment