Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అసైన్డ్ పట్టా పంట భూముల్లో ల్యాండ్ పూలింగ్ నిలుపుదల చేయాలి: రైతు సంఘం నేతలు నున్నా,బొంతు

అసైన్డ్ పట్టా పంట భూముల్లో ల్యాండ్ పూలింగ్ నిలుపుదల చేయాలి: రైతు సంఘం నేతలు నున్నా,బొంతు
-వారసత్వ భూములను పిఓబి జాబితా నుంచి తొలిగించాలి.
-తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

ఖమ్మం జిల్లాలో అసైన్డ్ పట్టా భూముల్లో ల్యాండ్ పూలింగ్ నిలుపుదల చేయాలని, వారసత్వ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలిగించాలి అని ధరణి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైరా మండలం సోమవరం, కొణిజర్ల మండలం తనికెళ్ళ తోపాటు ఇతర గ్రామాల రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులు, గిరిజన నిరుపేద రైతుల సాగు భూములను ల్యాండ్ పూలింగ్. పేరుతో బలవంతంగా లే అవుట్లు వెంచర్లు వేసే ఆలోచన విరమించుకొవాలి అని డిమాండ్ చేశారు దళితులు, గిరిజనలకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామని చెప్పి ఆచరణ లో భూములు ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు అసైన్డ్ పట్టాలు ఇచ్చిన సాగు భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరికాదని అన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు, నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో సారవంతమైన రెండు పంటలు సాగు చేస్తున్నా భూములను ల్యాండ్ పూలింగ్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు స్వాధీనంలో ఉన్న ఎకరం భూమి రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్లు వెంచర్లు వేసి రెండు వందల గజల స్థలం రైతుకు ఇస్తామని అంటు అసైన్డ్ పట్టా భూములను ప్రభుత్వ భూములుగా అధికారులు ప్రచారం చేయడం జరుగుతుందని రైతులను సాగుకు దూరం చేసే చర్యలు మానుకోవాలని సూచించారు.

వారసత్వ భూములను పిఓబి జాబితాలో చేర్చారని దీని వల్ల సోమవరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1183 వందలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని కనీసం కుటుంబ సభ్యులకు కూడా వారసత్వ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని వెంటనే అసైన్డ్ పట్టాలు వారసత్వ భూములను పిఓబి జాబితా నుంచి తొలిగించాలి అని డిమాండ్ చేశారు. ధరణి లోపాలను సరి చేసి రైతులకు సత్వరమే పాస్ పుస్తకాలు అందించాలని, గతంలో ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశారు. ధరణి సమస్యలు పరిష్కారం కోసం, ల్యాండ్ పూలింగ్ నిలుపుదల చేసేవరకు రైతులు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి రమేష్, చింతనిప్పు చలపతిరావు, తాతా భాస్కర్ రావు, వాసిరెడ్డి ప్రసాద్, తాళ్ళపల్లి కృష్ణ,సుంకర సుధాకర్, మల్లెంపాటి రామారావు, ఎస్.కె. మీరా, చెరుకు మల్లి కుటుంబరావు, శీలం పకీరమ్మ, హరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి కృష్ణారావు, ఎస్ కె సైదా, దంద్యాల కృష్ణ, ఎస్ కె బాబు జాన్, నిమ్మతోట నాగేశ్వరరావు, మల్లేల వెంకటేశ్వరరావు సుదర్శన్ రెడ్డి, రామయ్య, మధు, సైదులు, తిప్పతి కృష్ణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తీహార్ జైలులో పెట్టినా సరే పోటీ చేస్తా.. గెలుస్తా: భూమా అఖిలప్రియ..!

Drukpadam

రాజస్థాన్ లో కాంగ్రెస్ పుట్టి మునగనున్నదా?…సచిన్ వర్సెస్ గేహలోట్!

Drukpadam

తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం …. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు!

Drukpadam

Leave a Comment