Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెన్షన్ లు,,కొత్త రేషన్ కార్డులు కోసం ప్రజా పంథా ధర్నా,ప్రదర్శన

ఆసరా పెన్షన్ లు, డబల్ బెడ్ రూమ్లు,కొత్త రేషన్ కార్డులు కోసం కలెక్టరేట్ వద్దసిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ధర్నా,ప్రదర్శన

టిఆర్ఎస్ పార్టీ 2018లో అసెంబ్లీ ఎన్నికలలో 50 ఏళ్లు నిండిన అందరికీ పింఛన్ ఇస్తామని వాగ్దానం తో విజయం సాధించిందని,57 సంవత్సరాలు నిండిన 7.8 వృద్ధులకు ఆసరా పింఛన్ అప్లై చేసుకున్న మంజూరు చేయటం కేసీఆర్ మోసపు మాటలు తేలిపోయినాయని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. సోమవారం ఖమ్మంలో ధర్నాచౌక్లో సిపిఐ ఎంఎల్ ప్రజా పండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి, అనంతరం వందలాది మంది లబ్ధిదారులతో ప్రదర్శన, కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో మహిళలు చంటి పిల్లలతో వచ్చి ఎర్రటి ఎండ లను సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షత ను, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళకారులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పోటు రంగారావు హాజరై ప్రసంగిస్తూ, గడిచిన మూడు సంవత్సరాల కాలంలో నూతనంగా అర్హత పొంది,ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సుమారు 3.5 లక్షల ఆసరా పెన్షన్ ల ను అందించకుండా, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆయన అన్నారు. 2019 నుండి నూతనంగా 3.5 లక్షల ఆసరా పింఛన్లు లను లబ్ధిదారులకు అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క రకరకాల కారణాలతో మూడు లక్షలకు పైగా ఆసరా పింఛన్లు లను తొలగించడం దారుణమన్నారు. ఒకే కుటుంబంలో అనేకమంది అర్హులు ఉంటే కూడా అందరికీ ఇవ్వడంలేదని, ఒకే కుటుంబంలో పింఛన్దారులు మృతి చెందితే అదే కుటుంబంలో ఉన్న మరో అర్హుడుకు రెన్యువల్ చేయడం లేదని ఇది దారుణం అన్నారు.
సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా
ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దివ్యాంగులకు ముప్పై రెండు నెలలుగా నూతన పెన్షన్ ను పాలకులు ఇవ్వటం లేదని అన్ని అర్హతలు ఉండి కూడా మీ సేవలో అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు లేదని పెట్టి రేషన్ కార్డులు ఇవ్వకపోవటం ప్రభుత్వం శిక్ష అనుభవించడం దారుణమన్నారు. పేదలందరికీ 5లక్షల డబల్ బెడ్ రూమ్ లో అందిస్తామన్నారని, ఆ పథకం ఆచరణలో ఫెయిల్ అయిందని అన్నారు. కాంట్రాక్టర్లు ఐదు లక్షలు ఇచ్చి, సొంత ఇంటి జగనన్న వారికి మూడు లక్షలు ఇస్తే సరిపోవని ఐదు లక్షలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2019లో ఆసరా పెన్షన్ లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మూడు లక్షల మందికి తక్షణమే ఇవ్వాలని, ఒకే కుటుంబంలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రకాల పెన్షన్ నెలకు ఐదు వేల రూపాయల వరకు పెంచాలని, స్వంత జాగా కలిగిఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, నూతనంగా రేషన్ కార్డులు అందజేయాలని, తొలగించిన 3.5 లక్షల ఆసరా పెన్షన్ దారులను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుర్రం అచ్చయ్యఅఖిల భారత రైతుకూలీ సంఘంఏ ఐ కె ఎం ఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రసంగించారు* పార్టీ జిల్లా నాయకులు కె అర్జున్ రావు,జి రామయ్య,సీ వై పుల్లయ్య,నాగేశ్వరరావు,టీ ఝాన్సీ లక్ష్మి,* ఆవుల మంగతాయి, బందెల వెంకయ్యకుర్ర వెంకన్న* కే.సుబ్బారావు కే శ్రీనివాస్, మారుతి మల్లయ్య,*ఆడెపు రామారావు,ఎన్ వి రాకేష్,ఏ శరత్ పి వెంకట స్వామి, *బి శంకర్, జె ప్రేమ్ సింగ్,డి చంద్, *జే రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌ను తెలంగాణ నుంచి ప్రారంభించాల‌ని కోర‌తాం: రేవంత్ రెడ్డి!

Drukpadam

సోనియా గాంధీపై ఒవైసీ విమర్శలు…

Drukpadam

త్వ‌ర‌లోనే చెబుతా!.. పార్టీ మార్పుపై కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

Drukpadam

Leave a Comment