Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వడ్లపై రోడ్ వెక్కిన తెలంగాణ …

వడ్లపై రోడ్ వెక్కిన తెలంగాణ …
-తెలంగాణ వ్యాపితంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు
-పాల్గొన్నమంత్రులు ,ఎంపీలు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ,
-జడ్పీ చైర్మన్లు ,ఎంపీపీలు , జడ్పీటీసీ లు
-ప్రజాప్రతినిధులు , నామినేటేడ్ చైర్మన్లు డీసీసీబీ , డిసిఎంఎస్ చైర్మన్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనడంలో పక్ష పాతం చూపిస్తుందని నిరసిస్తూ టీఆర్ యస్ పిలుపు మేరకు సోమవారం తెలంగాణ వ్యాపితంగా ధర్నాలు జరిగాయి. ప్రజలు కేంద్రం వడ్లు కొనాల్సిందేనని రోడ్లు వెక్కరు . ఎక్కడ చుసిన గులాబీ దండు ధర్నాలవద్ద కేంద్ర విధానాలను తూర్పారపట్టింది. ఈ ధర్నాలో మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . కేంద్రం వడ్లు కొనకపోతే తెలంగాణ తఢాకా చూపిస్తామని హెచ్చరించారు. దశలవారీ ఆందోళనలో భాగంగా మొదటి విడతగా మండల కేంద్రాల్లో ధర్నాలు జయప్రదం అయ్యాయి. ఇక ఈ నెల 6 వ తేదీన రహదారులపై రాస్తారోకోలు ,7 రైతుల నిరసనలు , 8 న ఇళ్ల మీద నల్ల జెండాలు , 11 వతేదీన ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు ,ఎంపీలు నిరసనలు , ఉండనున్నాయి. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనేలా చేయాలనీ టీఆర్ యస్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మొదటిదశలో మండల ధర్నాలకు ప్రజలను కదిలించారు. టీఆర్ యస్ శ్రేణులు అన్ని కదిలి ధర్నాల్లో పాల్గొన్నాయి.

ఇది ఇలా ఉండగా సీఎం కేసీఆర్ కేంద్రం లో కదిలిక తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన నిన్ననే హుటాహుటిన ఢిల్లీ బయలు దేరి వెళ్లారు . ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఎంపీ లు ఇటు లోకసభ , అటు రాజ్యసభలో వడ్ల కొనుగోలు పై కేంద్రం చర్యలను నిరసిస్తూ పార్లమెంట్ ఉభయసభల్లో గొడవ చేశారు . రాష్ట్ర మంత్రులు కేంద్రం మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు . కేంద్రమంత్రి చర్యలపై రాష్ట్రమంత్రులు గరం గరం అయ్యారు . వడ్ల పై రచ్చ ఇటు రాష్ట్రం అటు కేంద్రం మధ్య యుద్ధం గా మారింది. చూద్దాం ఏమిజరుగుతుందో ….

Related posts

కేంద్ర వార్షిక బడ్జెట్ పై రాహుల్ గాంధీ స్పందన…

Drukpadam

రాహుల్‌, రేవంత్‌ల‌పై జీవ‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు!

Drukpadam

బీజేపీలో చేర‌ను తటస్తంగానే ఉంటా – ఈట‌ల రాజేంద‌ర్….

Drukpadam

Leave a Comment