Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరు ఓటమిపై రగిలి పోతున్న తుమ్మల …

పాలేరు ఓటమిపై రగిలి పోతున్న తుమ్మల …
-భాద్యులపై చర్యలు తీసుకోకపోవంపై ఆవేదన
-ఎక్కడ ఓడానో అక్కడే గెలవాలని పట్టుదల
-అందుకే పాలేరు లో తరుచు పర్యటనలు
-ఉమ్మడి జిల్లాలో గణనీయమైన సంఖ్యలో అనుయాయులు
-పార్టీ టికెట్ ఇస్తుందనే విశ్వాసం
-రాజకీయాల్లో ఓపిక అవసరమని వ్యాఖ్య
-మీకు నేను ఉన్నానని కార్యకర్తలకు భరోసా …

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం …ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన రాజకీయ దురంధరుడు …ఖమ్మం జిల్లా రాజకీయాలను తన ఒంటిచేత్తో నడిపినవాడు … నాడు ఎన్టీఆర్ హయాంలో గానీ, తరువాత చంద్రబాబు పాలనలో చక్రం తిప్పిన తుమ్మల నేడు 2018 పాలేరు ఎన్నికల్లో ఓటమిపై రగిలిపోతున్నారు .తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అని తెలిసిన తరువాత భాద్యులపై చర్యలు తీసుకోకపోగా వారిని అందలం ఎక్కించడంపై ఆవేదన చెందుతున్నారు . అందుకే ఇటీవల పాలేరు నియోజకవర్గంలోని చెరువుమాదారం పర్యటనలో రెచ్చిపోయి మాట్లాడారు …”శత్రువుల ను క్షమించవచ్చు కానీ పార్టీలో ఉండి ద్రోహం చేసినవారిని క్షమించరాదని ,వారే నిజమైన ద్రోవులని “ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది . ఇప్పుడు ఆయనకు ఏ పదవి లేకపోయినా ఆయన వెంట నడిచేవాళ్ళు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. ఆయనకు పార్టీ లో అన్యాయం జరుగుతుందని అనుయాయులు ఆగ్రహంగా ఉన్నారు.

ఇప్పటికీ టీఆర్ యస్ లోనే ఉన్న తుమ్మల పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసంతో ఉన్నారు . 2018 లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీచేయాలని గట్టి పట్టుదలతో పావులు కదుపుతున్నారు . ఇది సాధ్యమా ? ఇప్పుడు అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ యస్ లో చేరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . ఆయన్ను కాదని సీఎం కేసీఆర్ తుమ్మల కు పాలేరు టికెట్ ఇస్తారా ? అనేది అందరిమదిలో మెదులుతున్న ప్రశ్న ? ఒకవేళ అదే జరిగితే ఎవరో ఒకరు పార్టీకి దూరం కావడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే టీఆర్ యస్ కు తప్పకుండ మైనస్ అవుతుంది. మరి కేసీఆర్ మాజీ ,తాజాల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారు . ఇద్దరినీ సంతృప్తి పరచగలరా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఒకే ఒక మార్గం ఎమ్మెల్సీ టికెట్ ఉంది. అయితే ఇద్దరు ఎమ్మెల్సీ కి ఇష్టపడే వాళ్ళు కాదు .. ప్రజాక్షేత్రంలోనే గెలవాలని కోరుకునే వారు … అందువల్ల ఇక్కడ పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారె అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు ఉన్నాయి.

పాలేరు నియోజకవర్గంలో టీఆర్ యస్ పార్టీ వర్గపోరు ఆశక్తికరంగా మారింది. అక్కడ తుమ్మల , కందాల , పొంగులేటి శిబిరాలు ఉన్నాయి. పొంగులేటి శిభిరం సైలెంట్ గా ఉన్న ,కందాల , తుమ్మల శిబిరాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కందాల వర్గీయులు తుమ్మల వర్గీయులపై కేసులు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తుమ్మల వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ పై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు . అంతకుముందు ఆరెంపుల గ్రామానికి చెందిన జగదీష్ పై కేసు పెట్టారు . మరికొందరిని బెదిరిస్తున్నారని తుమ్మల వర్గీయులు ఆరోపిస్తున్నారు . ఉగాది రోజున మాజీ మంత్రి తుమ్మల జంగం భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు . వైరి వర్గం ఎమన్నా ఓపిక పట్టండి రానున్న రోజులు మనవే …మనం తొందర పడవద్దు ….అని కార్యకర్తలను సముదాహించారు. మీకు నేను ఉన్నానని కార్యకర్తలకు భరోసా కల్పించారు .

Related posts

ఖమ్మం అభివృద్ధి గుమ్మం…

Drukpadam

జులై 3 న హైద్రాబాద్ లో ప్రధాని మోడీ సభ …టార్గెట్ 10 లక్షలు…

Drukpadam

జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడా? అందుకే ప్రతిపాపక్షలపై విరుచుక పడుతున్నారా ??

Drukpadam

Leave a Comment