మంత్రి పదవుల రేసులో నేను లేనన్న ఆనం
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆనం
సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకోనని వెల్లడి
నేను కొత్తగా ఏమీ వెతుక్కోవాల్సిన అవసరం లేదని ప్రకటన
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కాసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల రేసులో తాను లేనని ఆయన సంచలన ప్రకటన చేశారు. సొంత ప్రయోజనాల కోసం తాను రాజకీయాలను వాడుకోనని చెప్పిన రామనారాయణ రెడ్డి..తాను కొత్తగాఏమీ వెతుక్కోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించిన ఆయన గవర్నర్ ఆమోదం తర్వాతే అందరికీ సమాచారం వస్తుందని తెలిపారు. జాబితాలో ఉన్న వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారని చెప్పిన ఆనం.. తాను మాత్రం మంత్రి పదవుల రేసులో లేనని వెల్లడించారు. సీనియర్ నేతగా ఉన్న ఆనంకు మంత్రివర్గంలో స్తానం ఉంటుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రస్తత మంత్రుల్లో ఒకరిద్దరు మినహా అందరికి ఉద్వాసన పలకానుండటంతో కొత్తగా మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకుంటారు ?అనేది ఆశక్తిగా మారింది. దీనిపై వివిధ మార్గాలద్వారా ఆరాతీస్తున్నారు . ఇప్పుడు ఉన్న మంత్రులు అమరావతి నుంచి పెట్ట బేడా సర్దుకొని తన సొంతఊర్లకు ప్రయాణం అవుతున్నారు . ఇప్పుడు ఉన్న మంత్రులను రెండున్నర సంవత్సరాలకు మాత్రమే అని చెప్పినప్పటికీ కొందరు మంత్రులు నిట్టూర్పులు తో ఉన్నారు . ధర్మాన కృష్ణ దాస్ , పేర్ని నాని , నారాయణస్వామి లాంటి వారు తమ మనుసులో ఉన్న మాటలను బయట పెట్టారు .అయినప్పటికీ సీఎం జగన్ చెప్పిన విధంగా నడుచుకోవడమే తమ కర్తవ్యమ్ అని ప్రకటించారు. మంత్రివర్గం నుంచి తప్పించే సీనియర్లను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని సీఎం జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు . గత మంత్రివర్గంలో తీసుకుంటారని భావించిన ధర్మాన ప్రసాద్ రావు , ఆనం రాంనారాయణ రెడ్డి లాంటి సీనియర్లలో ఆనం తాను రేసులో లేనని ప్రకటించారు.
రాష్ట్ర గవర్నర్ ను ఈ రోజు రాజభవన్ లో కలిసిన సీఎం జగన్ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకొనే వారి పేర్లను గవర్నర్ కు అందజేశారు . గవర్నర్ ఆమోదం తరవాత వారికీ సమాచారం అందిస్తారు . అప్పటివరకు ఎవరి పేర్లు ఉన్నాయనేది రహస్యంగానే ఉంటుంది.