Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ ఆడపడుచుకు ఏపీ కాబినెట్ లో చోటు …తెలంగాణ లో సంబరాలు!

తెలంగాణ ఆడపడుచుకు ఏపీ కాబినెట్ లో చోటు …తెలంగాణ లో సంబరాలు!
-ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా తెలంగాణ ఆడపడుచు రజని..
-యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండాపురం రజని స్వగ్రామం
-4 దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు ఆమె తండ్రి వలస
-ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహం

తెలంగాణ ఆడపడుచు అయిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజిని ఏపీ లోని జగన్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . యాదాద్రి భవనగిరి జిల్లా కొండాపూర్ కు చెందిన రజిని ఉన్నత విద్యావంతురాలు . 40 సవంత్సరాల క్రితమే ఆమె కుటుంబం హైద్రాబాద్ వెళ్ళింది. అక్కడ ఆమె ఉన్నత విద్యనభ్యసించి చిలకలూరి పేట కు చెందిన పారిశ్రామిక వేత్తను వివాహమాడారు . కొద్దీ సంవత్సరాలు పాటు అమెరికాలో ఉద్యోగం కూడా చేశారు . తరువాత ఆమె ఇక్కడకు వచ్చు రాజకీయాలు మీద మక్కువతో టీడీపీ లో చేరారు . 2019 ఎన్నికలకు ముందు ఆమె వైసీపీ లో చేరి చిలకలూరి పేట టికెట్ సంపాందించి పత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించారు . ఆమె జగన్ కాబినెట్ లో మంత్రి కావడమే కాకుండా చాల ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్య శాఖ ను కేటాయించారు .

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విడదల రజని ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కారణం.. ఆమె తెలంగాణ బిడ్డ కావడమే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కుమార్తే రజని. దాదాపు 4 దశాబ్దాల క్రితం సత్తయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లి సఫిల్‌గూడలో ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

రెండో కుమార్తె అయిన రజని ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన రజని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడామెకు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలు ఆమెకు కేటాయించారు. రజని మంత్రి అయిన విషయం తెలిసిన వెంటనే కొండాపురం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ఖమ్మంలో కేసీఆర్ కు కృతజ్ఞత సభ …సూపర్ హిట్…

Drukpadam

అసెంబ్లీలో భట్టి, మంత్రి హరీశ్ రావు మధ్య ‘జల’ యుద్ధం!

Drukpadam

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, జగన్ ఇంటికే …చంద్రబాబు

Drukpadam

Leave a Comment