Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి!

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి!
ప్రధాని మోడీ , సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
గ్యాస్ లీకై అంటుకున్న మంటలు
రియాక్టర్ పేలడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురి మృతి
ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం
తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం
ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశం

 

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

క్షతగాత్రులను నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి..

 

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.

ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్-4లో గత రాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను తొలుత నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని అక్కడి నుంచి విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని

 

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడడం తెలిసిందే. యూనిట్ 4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోవడం అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు భావిస్తున్నారు.

‘‘ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు కెమికల్ యూనిట్ లో ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Related posts

క్రికెటర్ రైనా బంధువులను హత్య చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రషీద్ ఎన్ కౌంటర్!

Drukpadam

ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు దుర్మరణం!

Drukpadam

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై …అధరాలు దొరక్కుండా నోట్లు మింగే ప్రయత్నం …

Drukpadam

Leave a Comment