Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

3 కోట్ల పెండింగ్ ఛ‌లాన్లు క్లియ‌ర్‌… 

3 కోట్ల పెండింగ్ ఛ‌లాన్లు క్లియ‌ర్‌… 

  • ఇప్ప‌టికే 3 కోట్ల పెండింగ్ ఛ‌లాన్లు క్లియ‌ర్‌
  • ప్ర‌భుత్వానికి రూ.300 కోట్ల మేర ఆదాయం
  • మ‌రోమారు పొడిగింపు లేద‌న్న పోలీసు శాఖ‌

తెలంగాణలో పెండింగ్ ఛ‌లాన్ల క్లియ‌రెన్స్ గ‌డువు ఈ రాత్రితో ముగియ‌నుంది. మార్చి 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన ఈ పెండింగ్ ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌లో భారీ రాయితీలు ప్ర‌క‌టించ‌డంతో వాహ‌న‌దారులు ఛ‌లాన్ల క్లియ‌రెన్స్ కోసం ఎగ‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో మార్చి 31తో గ‌డువు ముగియనుంద‌న‌గా.. మ‌రో 15 రోజుల పాటు గడువును పొడిగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ గ‌డువు కూడా శుక్ర‌వారం (ఏప్రిల్ 15) రాత్రి 12 గంట‌ల‌కు ముగియ‌నుంది. మ‌రోమారు గ‌డువును పొడిగించే ప్ర‌సక్తే లేద‌ని పోలీసులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

పెండింగ్ ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌లో భాగంగా ఇప్ప‌టిదాకా 3 కోట్ల పెండింగ్ ఛ‌లాన్లు క్లియ‌ర్ అయ్యాయి. పెండింగ్ ఛ‌లాన్లు క్లియ‌రెన్స్‌తో ప్ర‌భుత్వానికి రూ. 300 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. 65 శాతం పైగా పెండింగ్ ఛ‌లాన్ల‌ను వాహ‌న‌దారులు క్లియ‌ర్ చేశారు. టూ వీల‌ర్ల‌కు 75 శాతం, కార్ల‌కు 50 శాతం మేర రాయితీని ప్ర‌కటిస్తూ తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌కు వాహ‌నదారుల నుంచి భారీ స్పంద‌నే ల‌భించింది.

Related posts

తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు.. -ప్రభుత్వ ఆకస్మిక ఉత్తర్వులు…

Drukpadam

: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

Ram Narayana

వివేకా హత్య కేసు ఏపీ బయట విచారించాలన్న కూతురు సినీతా రెడ్డి !

Drukpadam

Leave a Comment