Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోనియా, రాహుల్ గాంధీల‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ!

సోనియా, రాహుల్ గాంధీల‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ!

  • కాంగ్రెస్‌లో పీకే చేర‌తారంటూ ప్ర‌చారం
  • పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట‌మిపై చ‌ర్చ‌
  • 2024 ఎన్నికల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై మంత‌నాలు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీల‌తో రాజకీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ శ‌నివారం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా పాలుపంచుకున్న ఈ స‌మావేశంపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌న్న వార్త‌లు కూడా ఈ భేటీపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

అయితే ఇటీవ‌లే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు… ప్ర‌త్యేకించి పంజాబ్‌లో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై చ‌ర్చించేందుకే ఈ భేటీ జ‌రిగిన‌ట్టుగా కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సంబంధించి పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహాల‌ బ్లూ ప్రింట్ రూప‌క‌ల్ప‌న‌పైనా ఈ భేటీలో ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

Related posts

తెలంగాణాలో మళ్ళీ టీఆరెస్సే …ఆరా సర్వే మస్తాన్ వలీ!

Drukpadam

హుజురాబాద్ లో గెలిచిన ఆత్మగౌరవం …ఓడిన అహంకారం!

Drukpadam

కర్ణాటకలో హైడ్రామా …సీఎం సీటుకోసం సిద్దరామయ్య …డీకే శివకుమార్ పట్టు…

Drukpadam

Leave a Comment