Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ పై రాహుల్ నజర్…అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు!

తెలంగాణ పై రాహుల్ నజర్…అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు!
-మే 6న వరంగల్ లో రాహుల్ గాంధీ సభ
-రైతు సంఘర్షణ సభ పేరుతో నిర్వహణ
-బియ్యం కొనుగోళ్లలో పాలక పక్షాల వైఖరిని ఎండగట్టే వ్యూహం
-7వ తేదీన హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకంగా అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై ద్రుష్టి పెట్టారు . ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర ముఖ్యనేతలను ఢిల్లీ కి పిలిచి రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలుసుకొని రాష్ట్రనేతలకు దిశా నిర్దేశం చేశారు . 2023 లో జరగనున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ ను రాష్ట్ర నాయకులకు పరిచయం చేశారు . ఇక నుంచి రాష్ట్ర నేతలతో జరిగే సమావేశంలో సునీల్ కూడా పాల్గొని తగిన చూచనలు ఇస్తారని చెప్పారు . అంతే కాకుండా అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సార్లు రాష్ట్ర పర్యటనకు రాహుల్ గాంధీ రానున్నారు . అందులో భాగంగానే ఈ నెల మే 6 ,7 తేదీలలో రాష్ట్రంలో పర్యటించనున్నారు .

వచ్చే నెల (మే) 6న వరంగల్ లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ‘రైతు సంఘర్షణ సభ’ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించనుంది ఆ సభలో మే 6న వరంగల్ లో రాహుల్ గాంధీ పాల్గొంటారు .

ఇక మరుసటి రోజు మే 7న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు గతంతో పోలిస్తే మెరుగయ్యాయన్న నివేదికల నేపథ్యంలో రాహుల్ పర్యటనకు వస్తుండడం గమనార్హం.

బియ్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలను ప్రజలకు తెలియచెప్పడమే రాహుల్ బహిరంగ సభ ఉద్దేశ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతులను ఆదుకోవడంలో పాలక పపక్షం తీరును ఎండగట్టడంతోపాటు, వారికి అండగా కాంగ్రెస్ ఉందని చెప్పడమే సభ లక్ష్యంగా పేర్కొన్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కానుంది. గ్రూపులుగా విడిపోయి కొట్లాడుతున్న పార్టీని ఐక్యంగా మార్చడం కూడా రాహుల్ పర్యటన లక్ష్యాల్లో ఒకటిగా తెలుస్తోంది.

Related posts

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై రాష్ట్రమంత్రి పువ్వాడ ఫైర్ …

Drukpadam

పాసు పుస్తకంపై జగన్ ఫొటో…నిప్పులు చెరిగిన చంద్రబాబు

Drukpadam

దేవినేని ఉమ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు …చంద్రబాబు ఫైర్!

Drukpadam

Leave a Comment