Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విజయ సాయి రెడ్డి కి ప్రమోషన్ నా ? డిమోషన్ నా ??

విజయ సాయి రెడ్డి కి ప్రమోషన్ నా ? డిమోషన్ నా ??
విశాఖ పార్టీ బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగింత!
విశాఖ పార్టీ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించిన అధిష్ఠానం
విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగింత
ఇకపై తాడేపల్లి నుంచి పని చేయనున్న విజయసాయి

వైసీపీ లో కీలక నేతగా ఉంది ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలను చూస్తున్న పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి కి పార్టీ లో ప్రమోషన్ నా ? డిమోషన్ నా ?? అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆశక్తి నెలకొన్నది . విజయసాయి రెడ్డి ఇప్పటివరకు విశాఖ భాద్యతలను చూసేవారు . విశాఖ పార్టీ బాధ్యతలను నిర్వహించిన విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా విశాఖ బాధ్యతలతో పాటు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను కూడా వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇటీవలనే ఆయనకు తాడేపల్లి కేంద్రంగా పార్టీ అనుబంధ సంఘాల భాద్యతలు అప్పగించారు. రాజ్యసభలో ఆయన పదవి కలం కూడా పూర్తీ కాబోతుంది. రాజ్యసభలో వీడ్కోలు ఉపన్యాసం కూడా చేశారు . అయితే ఢిల్లీ లో అన్ని విషయాలు తెలిసి ప్రధాని , హోమ్ మంత్రి దగ్గరకు నేరుగా వెళ్లగలిగే నేతగా ఆయనకు పేరుంది. అందువల్ల తిరిగి ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి తో పాటు రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి , లోకసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి లు కూడా కేంద్రంలో చొరవను ప్రదర్శిస్తున్నారు . అందువల్ల విజయసాయి రెడ్డికి సీఎం జగన్ తిరిగి అవకాశం కల్పిస్తారా ? లేక తాడేపల్లి కేంద్రం గా పార్టీ భాద్యతలు అప్పగిస్తారా అనేది ఆశక్తిగా మారింది.

మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించలేదు. విజయసాయికి ఇటీవలే పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పని చేయనున్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ మరింత ప్రాధాన్యతను కల్పించారు. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు.

Related posts

ఎయిమ్స్ లో రఘురామకు వైద్య పరీక్షలు.. రెండు కాళ్లకు కట్లు …

Drukpadam

బీఆర్ యస్ తో కామ్రేడ్ల పొత్తు లేనట్లేనా ?…హుస్నాబాద్ సిపిఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి …

Drukpadam

మరో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ!

Drukpadam

Leave a Comment