Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిలో తెలంగాణకు ఖమ్మం ఆదర్శం … మంత్రి కేటీఆర్

అభివృద్ధిలో తెలంగాణకు ఖమ్మం ఆదర్శం … మంత్రి కేటీఆర్
-ఖమ్మం మోడల్ అభివృద్ధి జరగాలి
కేంద్రం తీసుకోవటమే కాని ఇచ్చింది లేదు … అయినా అభివృద్ధి ఆగలేదు
– తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతో అభివృద్ధి సాధ్యమైంది
-ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన
-ఐటీ హబ్-2, బస్ స్టేషన్ ప్రారంభం
-విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయడం లేదు
ఖమ్మం నగర అభివృద్ధి తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని ఐ టి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రసంశలు కురిపించారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్ ఖమ్మం ,సత్తుపల్లిలలో వివిధ కారక్రమాలలో బిజీ ,బిజీ గా పాల్గొన్నారు. ఈ సందర్భగా నూతన బస్టాండ్ ప్రభోత్సవకార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. పనిలో పనిగా ఆయన కేంద్రం రాష్ట్రాల పట్ల చూపుతున్న పక్షపాతం పై విమర్శలు గుప్పించారు.
కేంద్రం మన దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడంలేదని ఆరోపించారు. విభజన చట్టంలో చెప్పింది ఏదీ కేంద్రం అమలు చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, దేశ అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
ఖమ్మం ఐటీ హబ్-2 నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వి.ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పెట్టుబడుల అంశంపై చాలామందిలో అస్పష్టత ఏర్పడిందని, కొత్త పెట్టుబడుల సంగతేమో కానీ, ఉన్న పెట్టుబడులైనా నిలుస్తాయా? అని భావించారని వివరించారు. కానీ పాలనా సమర్థత కలిగిన ముఖ్యమంత్రి, సరైన విధానాలు, స్థిరమైన ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉన్న అధికారుల వల్ల తెలంగాణలో ఐటీ రంగం దూసుకుపోయిందని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లు కాగా, ఇప్పుడది రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. కాగా, మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఆధునిక సదుపాయాలతో కూడిన ఖమ్మం బస్ స్టేషన్ ను కూడా ప్రారంభించారు. ఈ బస్ స్టేషన్ ను రూ.25 కోట్లతో నిర్మించారు. కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ ,వేముల ప్రశాంతారెడ్డి ఎంపీ నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ,ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్మితా సభర్వాల్ ఇంటికి అర్ధరాత్రి వేళ ఎందుకు వెళ్లాడో చెప్పిన డిప్యూటీ తహసీల్దార్!

Drukpadam

రాఘురామ వైద్య పరీక్షల రిపోర్ట్ స్పెషల్ మెసెంజర్ ద్వారా హైకోర్టు కు…

Drukpadam

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Drukpadam

Leave a Comment