Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైద్రాబాద్ లో రాహుల్ పర్యటన కాక!

హైద్రాబాద్ లో రాహుల్ పర్యటన కాక!
-ఉస్మానియా లో పర్యటనకు నో పర్మిషన్
-రాహుల్ ఉస్మానియా పర్యటనకు అనుమతి ఇవ్వలని విద్యార్థులు ఆందోళన
-హైద్రాబాద్ లో మినిస్టర్స్ క్వాట్టర్స్ ముట్టడి
-ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో సహా పలువురి అరెస్ట్ …
-జగ్గారెడ్డి తో పాటు విద్యార్ధి నాయకులను విడుదల చేయాలనీ పీసీసీ చీఫ్ రేవంత్ డిమాండ్

అసలే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు రాహుల్ తెలంగాణ రాష్ట్ర పర్యటన మరింత కాకపుట్టిస్తుంది. రాహుల్ పర్యటన జయప్రదం చేయాలనీ ఒకపక్క పీసీసీ ప్రయత్నం చేస్తుండగా రాహుల్ పర్యటన సక్సెస్ కాకుండా చేయాలనీ అధికార పక్షం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన కు రాహుల్ రాకను నిరాకరించింది. దీనిపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. మంత్రుల నివాసాలను ముట్టడించారు .ఉస్మానియాలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు .

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెలల 6 , 7 తేదీలలో జరుపనున్న పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. రాహుల్ రాకకోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ జనసమీకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే 7 వ తేదీన రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానికి యూనివర్సిటీ పాలకమండలి అనుమతి తెలపాల్సి ఉంది. పాలకమండలి రాహుల్ పర్యటన కు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం భగ్గుమన్నది . దీనికి ప్రభుత్వమే కారణమని తెలుసుకున్న విద్యార్థులు ఆదివారం హైద్రాబాద్ లోని మంత్రుల నివాసాలను ముట్టడించారు. ఇది ఉద్రిక్తలకు దారితీసింది.విద్యార్థులతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు .ఈ అరెస్టులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అరెస్ట్ చేసిన విద్యార్ధి నాయకులతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు .

రాహుల్ రాక సందర్భంగా వరంగల్ లో రైతు సంఘర్షణ పేరుతొ బహిరంగ సభను ఏర్పాటు చేశారు . దానికి లక్షలాదిమందికి సమీకరించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావించాయి. అందుకు తగ్గట్లుగా జిల్లాల నుంచి ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. 2023 ఎన్నికలు టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు వడ్డెందుకు ప్రయత్నిస్తుంది. రాహుల్ సభ ని ప్రతిష్టాత్మకంగా తీసుకోని పనిచేస్తుంది. జన సమీకరణ కోసం జిల్లాలవారీగా భాద్యులను సైతం ఏర్పాటు చేశారు . రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా తరువాత మొదటిసారిగా రాహుల్ రాష్ట్రానికి వస్తున్నందున తన సత్తా చాటాలనే ఉద్దేశంలో ఉన్నారు . అందుకు తగ్గట్లు గా జనసమీకరణలో బిజీ అయ్యారు . రాహుల్ సభ ద్వారా రాష్ట్రంలో ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసాన్ని కల్గించాలని గట్టి పట్టుదలతో పని చేస్తున్నారు . మరి రాహుల్ సభకు ఎంతమంది వస్తారు కాంగ్రెస్ కు ఇది ఏ మేరకు లాభం చేకూర్చుతుంది. అనేది చూడాల్సి ఉంది.

ఉస్మానియా వర్సిటీకి రాహుల్ గాంధీ వెళ్లి తీరతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy opines on Rahul Gandhi Osmania University Visit
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు ముందే వాడివేడి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉస్మానియా వర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించడం పట్ల విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టగా, పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన విద్యార్థి సంఘాల నేతలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీకి వెళ్లి తీరతారని స్పష్టం చేశారు. ఓ సాధారణ ఎంపీలా, ఓ సామాన్య పౌరుడిలా రాహుల్ ఓయూకి వెళతారని తెలిపారు. ఓయూని కేసీఆర్ తన సొంత జాగీరులా భావిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని, ఉస్మానియా వర్సిటీ నిజాం నిర్మించిన విద్యా సంస్థ అని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. బంజారాహిల్స్ పీఎస్ లో జగ్గారెడ్డిని కలిసిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

టీషర్ట్‌ ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే.. బయటకు పంపేసిన స్పీకర్‌

Drukpadam

‘మహా’ సర్కారు కుప్పకూలడం ఖాయమేనా?గంటగంటకు మారుతున్న పరిణామాలు !

Drukpadam

కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే సరేసరి లేకపోతె యుద్ధం ఆగదు : వైఎస్ ష‌ర్మిల‌…

Drukpadam

Leave a Comment