Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు తెరవెనుక …ఇప్పుడు తెరముందుకు!

ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు తెరవెనుక …ఇప్పుడు తెరముందుకు!
-రాజకీయాల్లో రాణిస్తారా ? అనే సందేహాలు
-గతంలో జేడీయూ లో చేరిన ప్రశాంత్ కిషోర్
-తిరిగి బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పగలరా ?
-పార్టీ నడపడం ఆషామాషీ కాదన్నా సంగతి తెలియందికాదు
-ప్రజలు కోరుకుంటే రాజకీయపార్టీ ఒకే …తాను కోరుకొని రాజకీయపార్టీ -పెట్టడంతో ఎంతవరకు సక్సెస్ అవుతారు …?

ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నవాడు ….ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తకు రాజకీయ వ్యూహకర్త ఎవరో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రశాంత్ కిషోర్ ను ప్రజలు రాజకీయాల్లోకి రమ్మని కోరుకోవడం వరకైతే ఒకే … బీహార్ లో ప్రస్తుతం రాజకీయ శూన్యతలేదు. ఆయన్ను రాజకీయాల్లోకి రమ్మని ప్రజలు కోరుకోవడంలేదు … తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకొని రాజకీయ పార్టీ పెడుతున్నాడు . దీనిలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఇప్పుడే చెప్పలేమని అభిప్రాయాలే ఉన్నాయి.

దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనివారు ఉండకపోవచ్చు … ఎదో చేయాలనే తపన ఉన్నవాడు …ప్రత్యేకించి బీజేపీని గద్దెదించాలని వ్యూహరచన చేస్తున్నవారు… ఇందుకు అనేక మంది ప్రముఖులను సైతం కలిసి చర్చలు జరిపారు . కాంగ్రెస్ లో చేరరాలని సోనియాతో సహా అగ్రనేతలతో సమావేశం అయి వారికీ దేశ రాజకీయాలు కాంగ్రెస్ అనుసరించాలిసిన పాత్రపై ప్రజంటేషన్ ఇచ్చారు . కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రేపో మాపో భాద్యతలు స్వీకరిస్తున్నారని పెద్ద ప్రచారం జరిగింది. ఎందుకో ఏమి జరిగిందో ఎక్కడ తేడా కొట్టిందో కానీ ఉన్నట్లు ఉండి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయాన్ని మార్చుకున్నారు . కాంగ్రెస్ లో ఆయన ప్రవేశాన్ని కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని నిర్ణయించుకున్నారు . అదికూడా తన సొంతరాష్ట్రం బీహార్ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు . అక్కడ సొంతపార్టీపెడుతున్నట్లు కూడా వెల్లడించారు .

ప్రశాంత్ కిషోర్ సడన్ గా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడానికి కారణాలు ఏమై ఉంటాయి. ఎవరు ఆయన్ను రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహించారు అనేది ఆశక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఇటీవల ఆయన తరచూ సమావేశం అవుతున్నారు . టీఆర్ యస్ ఎన్నికల వ్యూహానికి ఆయన టీం పనిచేస్తుందని అందుకు ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ కు అవగాహనా కుదిరినట్లు సమాచారం .

దేశరాజకీయాల్లో బీజేపీ కి ప్రత్యాన్మాయం కోసం కేసీఆర్ ఆరాట పడుతున్న సంగతి తెలిసిందే . అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ ను పార్టీ పెట్టమని సలహా ఇచ్చి ఉంటారని కూడా అభిప్రాయాలు ఉన్నాయి. చాల రాష్ట్రాలు కేసీఆర్ చూపుతున్న ప్రత్యాన్మయానికి అంత సుముఖంగా లేరని కాంగ్రెస్ లేని ప్రత్యాన్మాయం ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్నలు ఎదురౌతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ కలిసినపుడు కాంగ్రెస్ లేకుండా బీజేపీ కి ప్రత్యాన్మాయ శక్తులు ఎవరెవరు ఉన్నారని అడిగితె అందుకు సరైన జవాబు చెప్పలేకపోయారని సమాచారం . ప్రశాంత్ కిషోర్ ,కేసీఆర్ ల కలయికతో వారితో కలిసి వచ్చే శక్తులు ఎవరెవరు ? వీరు బీజేపీకి ప్రత్యాన్మయం అవుతారా ? అనే ఆశక్తి నెలకొన్నది ….

Related posts

కరోనా వ్యాక్సినేషన్ అంశంపై గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన ఉత్తమ్,భట్టి , రేవంత్

Drukpadam

అమెరికాలో ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి పూలవ‌ర్షం..

Drukpadam

కవితపై చర్యలకు హైకోర్టు లో ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ !

Drukpadam

Leave a Comment