కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతే రాజు …వ్యవసాయాన్ని పండుగ చేస్తాం…రేవంత్
=ధరణి పోర్టల్ రద్దు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.!
=రైతులకు ఒక్కసారిగా 2 లక్షల ఋణం రద్దు …పంటలకు గుట్టుబాటు ధరలు
=ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం …వరంగల్ డిక్లరేషన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తాం …వ్యవసాయాన్ని పండుగ చేస్తాం …ధరణి రద్దు చేస్తాం …ఒక్కసారిగా రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు రద్దు చేస్తామని వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు .
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిచిన ధరణి పోర్టల్ లో అనేక అవతవకలు చోటుచేసుకుంటున్నాయని, అసలైన భూయజమానికి చెందిన భూముల వివరాలు గల్లంతవుతున్న దాఖలాలు అనేకం చోటుచేసుకున్నప్పటికి పట్టించుకున్న నాధుడు లేక భూయజమానులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వరంగల్ రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్ధితి నెలకొనడంతో భూ హక్కుదారులు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. జవాబుదారీ తనంగా ఉండాల్సిన అధికారులు బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటే భూయజమానులు ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యలను ఏకరువు పెడుతూ రైతు డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం భూయజమానుల పట్ల శరాఘాతంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ రైతు సంఘర్షణ సభలో ప్రకటించారు. ధరణి పోర్టల్ లో కనినించాకుండాపోయిన భూములను తిరిగి హక్కుదారులకు ఇచ్చేందుకు వందకు వందశాతం ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ లో తమ భూమి వివరాలు కనిపించకపోడంతో లక్షలాది తెలంగాణ ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వ యంత్రాంగంలో ఏ ఒక్కరూ కూడా వానికి సమాధానం చెప్పేందుకు ఆసక్తిగా లేదని, అలాంటి వారి కోసం, ఎవరి భూమిని వారికి న్యాయ బద్దంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తుందని వరంగల్ రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.