Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికల సంఘమా? ఎన్నికల “కమిషన్ “నా ? రాహుల్ విమర్శ

  • ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత తీవ్ర ఆరోపణ
  • ‘ఎన్నిక కమిషన్‌’ను ద్వంద్వార్థంలో పేర్కొన్న యువనేత
  • ఈసీ కమిషన్‌ల కోసం పనిచేస్తోందని పరోక్ష విమర్శ
Rahul Gandhi Two word Jibe at EC

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అదీ కేవలం రెండే రెండు పదాలు ఉపయోగించారు. అసోంలో బీజేపీ ఎమ్మెల్యే కారులో శుక్రవారం ఈవీఎం లభించిన విషయం తెలిసిందే. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేత హిమంత విశ్వ శర్మ ప్రచారంలో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని రెండు రోజుల నుంచి ఈసీ ఒకరోజుకు తగ్గించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాహుల్ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ట్విటర్‌ వేదికగా ఎన్నికల సంఘాన్ని- ఎన్నికల ‘‘కమిషన్‌’’(Election “Commission”)గా అభివర్ణించారు. కమిషన్‌ను అనే పదానికి ప్రత్యేకంగా కోట్స్‌ పెట్టడంతో దానికి వేరే అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. కమిషన్‌ అన్న ఆంగ్లపదానికి తెలుగులో సంఘం అనే అర్థంతో పాటు ఒక పని చేయడానికి ప్రతిఫలంగా ఆశించే రుసుము అన్న అర్థం కూడా వస్తుంది. పరోక్షంగా.. ఎన్నికల సంఘం ప్రతిఫలం ఆశిస్తూ వేరొకరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Related posts

అమరావతి విషయంలో చంద్రబాబు నిర్ణయానికి జగ్గారెడ్డి మద్దతు !

Drukpadam

బెంగళూరు సిటీ బస్సులో రాహుల్ గాంధీ.. మహిళా ప్రయాణికులతో ముచ్చట!

Drukpadam

ఎమ్మెల్సీ ల నియామకం పై తెలుగు దేశం : ముగ్గురిపై క్రిమినల్ కేసులన్న వర్ల…

Drukpadam

Leave a Comment