Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏపీ లో సంచలనం …అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు పై కేసు ..

ఏపీ లో సంచలనం …అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు పై కేసు ..
ఏ1 చంద్రబాబు, ఏ2 నారాయణ.. నారాయణపై రెండవ కేసు!
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందంటూ కేసు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్
నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ

అమరావతి ల్యాండ్ పూలింగ్ పై అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,చంద్రబాబు క్యాబినెట్ లో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నారాయణపై కేసు నమోదు అయింది. జగన్ ముఖ్యమంత్రి అయినతరువాత అమరావతి రాజధాని కోసం రైతులవద్ద నుంచి తీసుకున్న భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి . జగన్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపింది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా రాజధాని భూముల విషయంలో అవినీతి , అక్రమాలు జరిగాయని నిర్దారించింది. తెలుగుదేశం జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో , కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎదురు దాడికి దిగింది. పర్సపారా ఆరోపణలు కోర్ట్ కేసుల నేపథ్యంలో చాల కాలం నుంచి అమరావతి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి , టీడీపీ కి మధ్య వివాదం నెలకొన్నది . చివరకు భూముల విషయంలో మరో కేసు నమోదు కావడంతో ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై కేసు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై మరో కేసు నమోదయింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్ననే సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ ను పేర్కొన్నారు. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

Related posts

‌బదులు తీర్చుకుంటాం … మావోయిస్టులకు అమిత్ షా హెచ్చరిక

Drukpadam

ఈసారి రివర్స్… చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు!

Drukpadam

ఫోన్ నంబరు అడిగితే ఇవ్వనన్నందుకు.. గ్యాంగ్ రేప్ చేస్తామని యువతికి యువకుల బెదిరింపు!

Drukpadam

Leave a Comment