Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు… విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు!

దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు… విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు!

  • దేశద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలువురు వ్యక్తులు
  • కేంద్రం పునరాలోచన చేస్తోందన్న సొలిసిటర్ జనరల్
  • విచారణ వాయిదా వేయాలని కోర్టుకు విన్నపం

దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవడం తెలిసిందే. ఈ పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. చట్టం అమలుపై కేంద్రం పునరాలోచన చేస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, తుది నిర్ణయానికి ఎంత సమయం తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. చట్టం దుర్వినియోగంపై ఆందోళనలు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ చెప్పారని సీజేఐ పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా పఠనం వల్లే ఈ కేసులు తెరపైకి వస్తున్నాయన్న వాదనలు కూడా ఉన్నాయని వివరించారు.

జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ, దేశద్రోహ చట్టాన్ని కేంద్రం పునఃపరిశీలించాలని స్పష్టం చేశారు. కేంద్రం 3-4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కేసు విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Related posts

సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

Drukpadam

శాశ్వత ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’వైపు సంస్థల మొగ్గు!

Drukpadam

విదేశీ విద్యార్థులకు చెక్ పెట్టే యోచనలో బ్రిటన్ ప్రధాని!

Drukpadam

Leave a Comment