Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశద్రోహ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు… దేశవ్యాపిత చర్చ!

దేశద్రోహ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు… దేశవ్యాపిత చర్చ!
-బ్రిటిష్ కాలంనాటి చట్టం అవసరమా ?అంటున్న న్యాయనిపుణులు
-లక్ష్మణ రేఖ అవసరం అంటున్న కేంద్రం
-దేశద్రోహ చట్టం కింద జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు బెయిల్ కు అప్లై చేసుకోవచ్చన్న సుప్రీం
-సెక్షన్ 124 ఏ పై విచారణ జరుపుతామన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
-విచారణకు వాయిదా వేసిన ధర్మాసనం

సెక్షన్ 124 ఏ కింద దేశద్రోహం కేసు నమోదు చేసి అనేక మందిని వేళ్ళ కొద్దీ జైళ్లలో పెట్టడంపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం అవసరం ఉందా? ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని మనం ఇప్పటికి ఉపయోగిస్తూ రాజకీయంగా తమకు అడ్డు వస్తున్నారని భావించిన పాలకులు కక్షపూరితంగా వ్యవ్యరించడం పై విమర్శలు ఉన్నాయి.స్వాతంత్య్రం వచ్చి 75 దాటినప్పటికీ రాజుల కాలం నాటి చట్టం అవసరమా ? అనే ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల ఏ చట్టం ఇప్పుడు అవసరం అనే చర్చ జరుగుతుంది . బ్రిటిష్ వాళ్ళు మనదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇంగ్లాండ్ రాణికి మనదేశంపై ఉన్న అధికారాలతో స్వతంత్రం కోసం పోరాడుతున్న వారిని రాజద్రోహం కింద కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించారు . కానీ మనకు స్వాతంత్య్రం వచ్చింది. మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం . అందుకు కావలిసిన చట్టాలను రూపొందించుకున్నాం .అయినప్పటికీ దేశద్రోహం లాంటి కాలం చెల్లిన చట్టాల పేరుతొ పాలకులన్నీ ప్రశ్నించడమే నేరంగా భాహించి కటకటాల పాలు జేస్తున్నాం . మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్నీ పరిశీలించుకోవాలనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీం స్పందన ఇప్పుడు దేశవ్యాపితంగా చర్చనీయాంశం అయింది. చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ చట్టాన్ని పునః పరిశీలించేవరకు అమలును నిలిపి వేయాలని సుప్రీం చారిత్రాత్మకమైన ఆదేశాలు జారీచేసింది. వలసపాలన నాటి రాజద్రోహ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర హోమ్ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు దేశద్రోహం కింద కొత్త కేసులు నమోదు చేయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించడం చారిత్రాత్మక విషంగా న్యాయనిపుణులు పేర్కొంటున్నారు .

 

Related posts

రేపు ‘ఛలో విజయవాడ’కు అంగన్వాడీల పిలుపు… అనుమతి లేదంటున్న పోలీసులు

Ram Narayana

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఒకదానినొకటి ఢీకొన్న 8 కార్లు

Drukpadam

పుతిన్ బతికున్నాడో లేదో అనుమానమే!: జెలెన్ స్కీ

Drukpadam

Leave a Comment