Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్ రాజీనామా!

త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్ రాజీనామా! కొత్త సీఎం గా డాక్టర్ మాణిక్ సాహు
2018లొ త్రిపుర సీఎంగా బిప్ల‌వ్ ప్ర‌మాణం
నాలుగేళ్లుగా స‌జావుగానే పాల‌న సాగించిన వైనం
బీజేపీ అధిష్ఠానం ఆదేశాల‌తోనే రాజీనామా అంటూ ప్ర‌చారం
కొత్త సీఎంను ఎంపిక చేయ‌నున్న బీజేపీ

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 2018 లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా గత రెండు దశాబ్దాలకుపైగా అప్రతిహతంగా పాలిస్తున్న సిపిఎం ఓటమి చెందటామె కాకుండా ఎప్పుడు ఇక్కడ పేరు వినిపించని బీజేపీ అధికారంలోకి వచ్చింది. సీఎం గా బిప్లవ కుమార్ దేవ్ ఎన్నికయ్యారు . గత నాలుగు సంవత్సరాలుగా ఆయన పాలన సాఫీగానే సాగిస్తున్నారు .అయినప్పటికీ ఆయన రాజీనామా చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకు రాజీనామా చేశారు అనేది ఇంకా తెలియరాలేదు .

ఈశాన్య రాష్ట్రం త్రిపుర‌లో రాజ‌కీయంగా శ‌నివారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం ప‌ద‌వికి బీజేపీ నేత బిప్ల‌వ్ కుమార్ దేవ్ కాసేప‌టి క్రితం రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కే బిప్ల‌వ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

2018లో త్రిపుర సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా… గ‌డ‌చిన నాలుగేళ్ల పాటు ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే న‌డిపించారు. అయితే కార‌ణాలేమిటో తెలియ‌దు గానీ… ఉన్న‌ట్టుండి ఆయ‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు, ఈ నేప‌థ్యంలో బిప్ల‌వ్ స్థానంలో త్రిపుర సీఎం ప‌ద‌వికి మ‌రో కొత్త నేత‌ను కొద్దీసేపటి క్రితం బీజేపీ ఎమ్మెల్యేలు డాక్టర్ మాణిక్ సాహు ను ఎన్నుకున్నారు

త్రిపుర కొత్త సీఎం గా డాక్టర్ మాణిక్ సాహు

బిప్లవ దేవ్ రాజీనామాతో త్రిపుర ముఖ్యమంత్రి గా డాక్టర్ మాణిక్ సాహు ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. బిప్లవ దేవ్ ని ఎందుకు రాజీనామా చేయమన్నారు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

త్రిపురలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ పరిణామ జరగటం బీజేపీ లో జరుగుతున్న పరిణామాలను ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. 2023 మార్చ్ నాటికీ అసెంబ్లీ గడువు ముగియనున్నది . అంటే ఈ ఏడాది చివర్లోగాని లేదా వచ్చే ఏడాది మొదటిలో గని ఎన్నికల షడ్యూల్ వెలువడనుంది .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు ప్రభావం ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Related posts

ఎమ్మెల్సీ స్థానానికి నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి!

Drukpadam

బండి సంజయ్ మిలీనియం మార్చ్ పై మండిపడ్డ హరీష్ రావు…

Drukpadam

దేవినేని ఉమకు హాని తలపెట్టేందుకే జైలు సూపరింటిండెంట్ బదిలీ: అచ్చెన్నాయుడు!

Drukpadam

Leave a Comment