Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పార్టీ పదవుల్లో 50 శాతం బడుగు బలహీన వర్గాలకే : కాంగ్రెస్ కీలక నిర్ణయం

పార్టీ పదవుల్లో 50 శాతం బడుగు బలహీన వర్గాలకే : కాంగ్రెస్ కీలక నిర్ణయం
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు
చింతన్ శిబిర్ సమావేశాల్లో కీలక నిర్ణయం
పార్టీలో సంస్థాగతమైన మార్పుల దిశగా కాంగ్రెస్
రెండో రోజు కొన‌సాగుతున్న‌ చింత‌న్ శిబిర్… సోనియా నేతృత్వంలోని బృంద చర్చలో రేవంత్‌
ఉద‌య్‌పూర్‌లో చింత‌న్ శిబిర్‌
రెండో రోజూ కొన‌సాగుతున్న బృంద చర్చలు ‌
పార్టీ నిర్మాణంపై చ‌ర్చించిన వైనం

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల చింతన్ శిబిర్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చిస్తోంది. పార్టీలో సంస్థాగతమైన మార్పులను తీసుకురావడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పార్టీ కీలకనేత ఒకరు తెలిపారు.

పార్టీ నిర్మాణం పై చర్చలో రేవంత్ రెడ్డి

రాజ‌స్ధాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మైన కాంగ్రెస్ పార్టీ మేధోమ‌థ‌న స‌ద‌స్సు న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్ రెండో రోజైన శ‌నివారం కూడా కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా స‌మావేశానికి హాజ‌రైన నేత‌లంతా బృంద చర్చలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.

శ‌నివారం జ‌రిగిన ఈ తరహా చర్చలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉత్సాహంగా క‌నిపించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ నిర్మాణంపై జ‌రిగిన బృంద చర్చలలో రేవంత్ రెడ్డి పాలుపంచుకున్నారు. ఆదివారం కూడా చింత‌న్ శిబిర్ కొన‌సాగనుంది.

 

Related posts

ఆస్ట్రేలియాలోనూ అదే తంతు… బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు

Ram Narayana

తడిసి ముద్దైన తెలంగాణ …గోదావరికి వరద ప్రవాహం !

Drukpadam

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీరుపై ప్రధాని అభ్యంతరం…

Drukpadam

Leave a Comment