Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వినీలాకాశంలో… రుధిర చంద్రుడు….

వినీలాకాశంలో…
రుధిర చంద్రుడు….

•ఈ ఏడాది ఇదే తొలి చంద్రగ్రహణం …
•పాశ్చాత్య దేశాల్లో ఇవాళ రాత్రి 10.27 గంటలకు సంపూర్ణ చంద్ర గ్రహణం …
•మన దేశంలో రేపు ఉదయం 7.57 గంటలకు …
•నాసా ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు వీలు

రుధిర వర్ణ చంద్రుడు ఈరోజు కను విందు చేయబోతున్నాడు. వినీలాకాశంలో ఎరుపు రంగు పులుముకొని రుధిర వర్ణం శోభితం కానున్నాడు. ఈ సుందర దృశ్యాన్ని ప్రపంచమంతా చూడబోతోంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఇదే. అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించనుంది.
ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం, ఈరోజు రాత్రి 10.27 గంటలకే ప్రారంభమై అర్ధరాత్రి దాటాక 12.53 గంటల వరకు ఉంటుంది. మన కాలమానం ప్రకారం రేపు ఉదయం 7.57 గంటల నుంచి 10.15 గంటల వరకు కొనసాగుతుంది. చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్లిపోయే ముందు ఎర్రటి రంగులోకి మారిపోతాడని సైంటిస్టులు చెబుతున్నారు.
సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు మాత్రం చెల్లాచెదురవుతాయని, ఎరుపు, నారింజ రంగులు మాత్రం కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని అంటున్నారు . గ్రహణం సమయంలో చంద్రుడు కొద్దిసేపు మాయమైపోతాడు. అయితే, చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి కళ్లద్దాలు అవసరం లేదని, రక్షణ పరికరాల్లేకుండానే చూడవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం పతాక స్థాయికి చేరినప్పుడు చంద్రుడు 3,62,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడని సైంటిస్టులు అంచానా వేశారు.
కాగా, మన దేశంలో గ్రహణం చూసే అవకాశం లేదు. దక్షిణ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రమే రుధిర చంద్రుడు దర్శనమిస్తాడు. రోమ్, బ్రసెల్స్, లండన్, ప్యారిస్, హవానా, జొహెన్నస్ బర్గ్, లాగోస్, మాడ్రిడ్, సాంటియాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, గ్వాటెమాలా సిటీ, రియో డి జనేరో, షికాగోల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. అంకారా, కైరో, హొనొలులు, బూడాపెస్ట్, ఏథెన్స్ లలో పాక్షిక గ్రహణమే దర్శనమివ్వనుంది.
మన దేశంలో గ్రహణం చూడలేమనే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ దృశ్యాన్ని నాసాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. గ్రహణాన్ని చూడాలనుకుంటే రేపు ఉదయం 8.33 గంటలకు నాసా వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఐతే, ఈ ఏడాది మొత్తంగా రెండు చంద్రగ్రహణాలు దర్శనమివ్వనున్నాయి. ఇవాళ్టిది మొదటిది కాగా.. రెండో గ్రహణం నవంబర్ 8న కనువిందు చేయనుంది.

Related posts

కేసీఆర్‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Drukpadam

ఒక్క సెకనులో కరోనా టెస్ట్ … ఫ్లోరిడా వర్సిటీ సరికొత్త సాంకేతికత…

Drukpadam

3 Skincare Products You Need to Bring the Spa Home

Drukpadam

Leave a Comment