Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ రాజ్యసభ అభ్య‌ర్థుల‌ జాబితాలో లేని ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీలు…

వైసీపీ రాజ్యసభ అభ్య‌ర్థుల‌ జాబితాలో లేని ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీలు…
-తెలంగాణ బీసీ నేత కృష్ణయ్య కు ఏపీ నుంచి రాజ్యసభ సీటు
-వ‌రుస‌గా రెండోసారి రాజ్య‌స‌భ‌కు సాయిరెడ్డి
-జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త న్యాయవాది నిరంజ‌న్ రెడ్డికి ఛాన్స్‌
-బీసీ కోటాలో బీద మ‌స్తాన్‌రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌ల‌కు అవ‌కాశం
-వైసీపీ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టించిన మంత్రి బొత్స‌

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలలో వైసీపీ నుంచి ఎంపిక చేసిన నలుగురిలో ఇద్దరు బీసీ కాగా , మరో ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం … గతంలోకాని ,ఇప్పుడు కానీ ఎస్సీ , ఎస్టీలకు ,మైనార్టీలకు చేటు దక్కలేదు . కాగా ఇద్దరు బీసీల్లో తెలంగాణ నుంచి బీసీ నాయకుడు క్రిష్ణయ్య కు చోటు కల్పించడం ఆశ్చర్యకరం . ఏపీ లో అనేక మంది బీసీలు ఉండగా క్రిష్ణయ్య ఎంపిక చేయడంపై వైసీపీ లోనే కొందరు బీసీ లు మదనపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి ఇద్దరు బీసీలు ఉన్నారు . వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ , మోపిదేవి వెంకట రమణ ఉండగా , మరో ఇద్దరికీ బీసీలకు ఇవ్వడం పై మిగతా సామాజికవర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది .

ఏపీలో 4 రాజ్య‌స‌భ సీట్ల‌కు అధికార వైసీపీ న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తుది జాబితాను సీఎం జ‌గ‌న్ ఖరా‌రు చేయ‌గా… మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ న‌లుగురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు.

అంతా భావించిన‌ట్లుగానే పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోమారు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చేందుకు వైసీపీ అధిష్ఠానం నిర్ణ‌యించింది. ఇక జ‌గ‌న్‌కు వ్య‌క్తిగ‌త న్యాయ‌వాదిగా కొన‌సాగుతున్న నిరంజ‌న్ రెడ్డికి కూడా ఆ పార్టీ రాజ్య‌స‌భ సీటు ఇచ్చింది. మిగిలిన రెండు స్థానాల‌ను బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మ‌స్తాన్ రావు, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ల‌కు ఇస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది.

Related posts

రేవంత్ రెడ్డి ఒక థర్డ్ రేట్ క్రిమినల్: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు…

Drukpadam

బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మహిళానేత… జడ్పీటిసి పదవికి రాజీనామా!

Drukpadam

మహిళలకు ప్రధాని మోదీ రూ.1,000 కోట్ల కానుక!

Drukpadam

Leave a Comment