Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గుజరాత్ లో నింగి నుంచి నేల రాలిన లోహపు బంతులు.. పరీక్షల కోసం ఇస్రోకు తరలింపు!

గుజరాత్ లో నింగి నుంచి నేల రాలిన లోహపు బంతులు.. పరీక్షల కోసం ఇస్రోకు తరలింపు!

  • ఈ నెల 12, 13 తేదీల్లో నేల రాలిన లోహపు బంతులు
  • ఎవరికీ హాని కలగలేదన్న డిప్యూటీ ఎస్పీ
  • చైనా రాకెట్ అంతర్భాగాలై ఉండొచ్చన్న అమెరికా ఖగోళ శాస్త్రవేత్త
Mysterious metal balls fell in Gujarat

గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ఇటీవల నాలుగు గోళాకార లోహపు వస్తువులు ఊడిపడ్డాయి. ఇవి ఒకటిన్నర అడుగుల వ్యాసంలో ఉన్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో ఆనంద్ జిల్లాలోని ఖంభోలాజ్, రాంపూర్, దగ్జిపురా, ఖేడా జిల్లాలోని భూమేల్ గ్రామాల్లో ఈ వస్తువులు పడ్డాయి. వీటిని చూసిన స్థానికులు అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో వీటిని సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం ఇస్రోకు తరలించారు.

ఈ సందర్భంగా ఆనంద్ జిల్లా డిప్యూటీ ఎస్పీ జడేజా మాట్లాడుతూ… వీటి వల్ల ఎవరికీ హాని కలగలేదని చెప్పారు. పరిశోధన నిమిత్తం వీటిని ఇస్రోకు పంపించామని తెలిపారు. గతంలో వడోదర జిల్లాలోని సావ్లి గ్రామంలో కూడా ఇలాంటి శకలాలే కనిపించాయని చెప్పారు. మరోవైపు అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్ మెక్ డొవెల్ మాట్లాడుతూ… ఈ శకలాలు చైనాకు చెందిన ఛాంగ్ జెంగ్ 3బీ రాకెట్ అంతర్భాగాలై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రాకెట్ భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు అవి కింద పడి ఉండొచ్చని అన్నారు.

Related posts

మందడంలో భోగి వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Ram Narayana

లంచాలు తీసుకోక తప్పదన్న తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

Ram Narayana

తనను తాను పెళ్లి చేసుకున్న గుజరాతీ యువతి క్షమాబిందు…

Drukpadam

Leave a Comment