గాయత్రీ రవి రాజ్యసభ సభ్యుడిగా ఖమ్మం నే ఆప్ట్ చేసుకుంటారా ?
–వరంగల్ కు వెళ్లనున్నారా?
–ఖమ్మం కేంద్రంగానే ఆయన కార్యకలాపాలు
–సీఎం కేసీఆర్ ఖమ్మం లోనే పని చేసుకోమన్నారా ?
–రవి రాజకీయ కేంద్రంపై పెరుగుతున్న ఆశక్తి
గాయత్రీ రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర ….నిన్నటివరకు ఏ పదవి లేని టీఆర్ యస్ సామాన్య కార్యకర్త …నేడు పెద్దల సభకు ఎన్నిక కాబోతున్న పార్లమెంట్ సభ్యుడు …. ఇంతలోనే ఎంతమార్పు …అనుకోకుండా లభించిన వరం అని చాలామంది అంటున్నారు …. ఇందులో రవి మంచితనం ….నలుగురిని కలుపుకొని పోయే మనస్తత్వం ….వివాదరహితుడనే పేరు …స్నేహం శీలి అనే ప్రచారం … కేసీఆర్ , కేటీఆర్ వద్ద మంచి మార్కులు కొట్టి వేయడం …లాంటివి అనేకం వెరసి కలిసొచ్చిన అదృష్టం … చట్ట సభలకు వెళ్లాలనే ఆయన బలమైన కోరిక తీరబోతుంది. …. ఒక్కరే నామినేషన్ వేసినందున ఆయన గెలుపు లాంఛనమే …. ఒకరకంగా చెప్పాలంటే ఇక ఆయన ఎంపీ రవి …అయితే అయన ఎంపీ గా ఏజిల్లాను ఎంపిక చేసుకోబోతున్నారు …. ఖమ్మం పైన ఆయన కు మక్కువ …వరంగల్ స్వంత జిల్లా అయినప్పటికీ గత 25 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా ప్రజలతో ఆయన స్నేహం ,వ్యాపారం పెనవేసుకు పోయింది. అందువల్ల కచ్చితంగా ఆయన ఖమ్మం జిల్లా ఆప్ట్ చేసుకుంటారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి . అలా అని ఆయన తన ఇష్టాను సారం వ్యవహరించే వ్యక్తికాదు . రవి తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటానని కేసీఆర్ ,కేటీఆర్ సూచనలను తూ..చ తప్పకుండ అమలు చేస్తానని అంటున్నారు .
మరి అలాంటప్పుడు గాయత్రీ రవి రాజ్యసభ సభ్యుడుగా ఏ జిల్లాను ఎంపిక చేసుకుంటారు… సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు ఏ జిల్లాను ఎంపిక చేసుకోమని చెబుతారు లేదా ఆయన్నే ఎంపిక చేసుకోమని అంటారా? . అనేదానిపై ఆశక్తి నెలకొన్నది. ఖమ్మం జిల్లాను ఆప్ట్ చేసుకుంటారా ? వరంగల్ ను చేసుకుంటారా ? అనే చర్చ జరుగుతుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది …..