ఆస్ట్రేలియా ఎన్నికల్లో తమాషా.. లోదుస్తుల్లో వచ్చి ఓటేసిన స్త్రీపురుషులు!
- 2007 తర్వాత ఆస్ట్రేలియాలో ఎన్నికలు
- విజయం సాధించిన విపక్ష లేబర్ పార్టీ
- స్విమ్‌వేర్ బ్రాండ్ ఆఫర్‌కు అనూహ్య స్పందన
- అండర్‌వేర్, స్విమ్‌సూట్‌లలో వచ్చి ఓటేసిన వందలాదిమంది
aఆస్ట్రేలియాలో 2007 తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికలకు విపరీతమైన మీడియా అటెన్షన్ లభించింది. ఇందుకు చాలా కారణాలు ఉండగా అన్నింటికంటే ముఖ్యమైనది మాత్రం ‘అండర్‌వేర్ ఓటింగ్’. అందుకు కారణం మాత్రం వేడి వాతావరణం ఎంతమాత్రమూ కాదు. స్విమ్‌వేర్ బ్రాండ్ అయిన ‘బడ్జీ స్మగ్లర్’ ఇచ్చిన ఆఫర్‌కు ఎగబడిన జనం ఇలా అండర్‌వేర్లు ధరించి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. లో దుస్తులు ధరించి ఓటేసి దానిని సోషల్ మీడియాలో #SmugglersDecide హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్‌వేర్‌ను ఉచితంగా ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.
ఈ ఆఫర్ తెగ నచ్చడంతో పురుషులు, మహిళలు అండర్‌వేర్ ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు. పురుషులు అండర్‌వేర్‌తో రాగా, మహిళలు స్విమ్ సూట్ ధరించి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారంతా తమ ఫొటోలను షేర్ చేశారు. తమ ప్రకటనకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఊహించలేదని ‘బడ్జీ స్మగ్లర్స్’ ఆనందం వ్యక్తం చేసింది. ఏదో ఒకరిద్దరు ఇలా వస్తారని భావించామని, కానీ వందలమంది వచ్చారని పేర్కొంది. వారందరికీ సోమవారం నుంచి బహుమతులు ఇస్తామని ప్రకటించింది.